లక్నో: ఒక మహిళా పేషంట్‌కి ఇంజక్షన్ ఇచ్చేందుకు ఒక నర్సు చాలా దురుసుగా ప్రవర్తించింది. ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా బెడ్‌పై పడుకోబెట్టి ఇంజెక్షన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మాధ్యమంలో వైరల్ కాగా, నర్సు తీరుపై పలువురు మండిపడుతున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సీతాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ఆస్పత్రి అధికారి స్పందించారు. రోగిని అక్టోబర్ 18న ఆమె బంధువులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆ పేషంట్ ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో హఠాత్తుగా హింసాత్మకంగా ప్రవర్తించడం ప్రారంభించింది. తన గాజులు పగలు కొట్టుకుని, బట్టలు చించేసుకుంది.
దీంతో అదే వార్డులో ఉన్న ఇతర మహిళా పేషంట్లు భయాందోళనలకు గురయ్యారు. సదరు పేషంట్‌ని కంట్రోల్ చేసే నిమిత్తం అలా నర్సు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆ తదనంతరమే పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు. ఆమెను అదుపుచేయడానికి నర్సు అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. నర్సు దురుసుగా ప్రవర్తించిందంటూ వస్తున్న ఆరోపణలను డాక్టర్ సింగ్ తోసిపుచ్చారు.
सीतापुर जिला अस्पताल से हैरान करने वाला वीडियो आया सामने,स्टॉफ नर्स एक महिला मरीज की चोटी पकड़कर बेड पर पटकती नजर आई,वीडियो वायरल.@dm_sitapur @myogiadityanath @CMOfficeUP @brajeshpathakup#UttarPradesh #Sitapur#सीतापुर @abcnewsmedia pic.twitter.com/WhPaZUHbpx
— ASHISH YADAV (@AshishYadavknp) October 28, 2022
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment