grabbed
-
జుట్టు పట్టుకుని ఈడ్చేసిన నర్సు.. వీడియో దుమారం
లక్నో: ఒక మహిళా పేషంట్‌కి ఇంజక్షన్ ఇచ్చేందుకు ఒక నర్సు చాలా దురుసుగా ప్రవర్తించింది. ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా బెడ్‌పై పడుకోబెట్టి ఇంజెక్షన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మాధ్యమంలో వైరల్ కాగా, నర్సు తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సీతాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ఆస్పత్రి అధికారి స్పందించారు. రోగిని అక్టోబర్ 18న ఆమె బంధువులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆ పేషంట్ ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో హఠాత్తుగా హింసాత్మకంగా ప్రవర్తించడం ప్రారంభించింది. తన గాజులు పగలు కొట్టుకుని, బట్టలు చించేసుకుంది. దీంతో అదే వార్డులో ఉన్న ఇతర మహిళా పేషంట్లు భయాందోళనలకు గురయ్యారు. సదరు పేషంట్ని కంట్రోల్ చేసే నిమిత్తం అలా నర్సు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆ తదనంతరమే పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు. ఆమెను అదుపుచేయడానికి నర్సు అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. నర్సు దురుసుగా ప్రవర్తించిందంటూ వస్తున్న ఆరోపణలను డాక్టర్ సింగ్ తోసిపుచ్చారు. सीतापुर जिला अस्पताल से हैरान करने वाला वीडियो आया सामने,स्टॉफ नर्स एक महिला मरीज की चोटी पकड़कर बेड पर पटकती नजर आई,वीडियो वायरल.@dm_sitapur @myogiadityanath @CMOfficeUP @brajeshpathakup#UttarPradesh #Sitapur#सीतापुर @abcnewsmedia pic.twitter.com/WhPaZUHbpx — ASHISH YADAV (@AshishYadavknp) October 28, 2022 (చదవండి: -
గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం
పనాజీ: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ పగ్గాలు చేపట్టిన వెంటనే భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని హోం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండజ్కి గోవాలోని అస్సాగోలో సుమారు 13, 900 చ.కిమీ పూర్వీకులు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కబ్జాకి గురయ్యిందని బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్ ఫిర్యాదు చేసినట్లు గోవా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సిట్) అధికారి నిధి వాసన్ తెలిపారు. ఫెర్నాండజ్ ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఫెర్నాండెజ్‌కు అతని కుటుంబసభ్యులకు చెందిన అస్సగావో గ్రామంలో సర్వే నెంబర్ 253/3, 252/3లో ఉన్న ఆస్తులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇన్వెంటరీ ప్రోసీడింగ్లను దాఖలు చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయా వ్యక్తుల ఈ ఏడాది జులై 27న ఆ ప్రోసీడింగ్లను దాఖలు చేసినట్లు ఆగస్టులో తనకు తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా ఫెర్నాండజ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ గోవా ఎన్నారై కమిషనరేట్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నారై కమీషనర్ నరేంద్ర సవైకర్ మాట్లాడుతూ... తమ శాఖకు గతవారమే ఈమెయిల్ వచ్చిందని, దీన్ని రాష్ట్ర హోం శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఇలాంటి భూ కబ్జా కేసులను నివారించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్, రెవెన్యూ, ఆర్కెవ్స్, పురావస్తు శాఖ అధికారులతో కూడిన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ రాష్ట్రంలో ఇలాంటి భూ కబ్జా కేసులకు సంబంధించి సుమారు 100కు పైగా కేసులను దర్యాప్తు చేస్తోంది. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 7 కోట్లు స్వాధీనం) -
ప్రాంక్ వీడియో.. చితకబాదిన ప్రయాణికులు
జడ్చర్ల: ప్రాంక్ వీడియోకోసం భిక్షాటన చేస్తూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి యువకులు దెబ్బలు తిన్న ఘటన జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా కొందరు యువకులు ప్రయాణికుల దగ్గరకు వచ్చి భిక్షాటనతో హడావుడి చేశాడు. డబ్బులు ఇవ్వని వారి పాదాలను పట్టుకున్నారు. మహిళల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రవర్తన హద్దు మీరడంతో అక్కడున్న ప్రయాణికులు వారిని పట్టుకుని చితక బాదారు. దీంతో తాము ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని, ఈ సన్నివేశాలను తమ మిత్రులు రహస్యంగా చిత్రీకరిస్తున్నారని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో సదరు యువకులు ప్రయాణికులకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. (చదవండి: యాప్స్‌తోనే లక్ష్మీపతి నెట్వర్క్) -
భూ మాయగాళ్లు
తిరుపతి చుట్టూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నేతలు అధికారుల సహకారంతో అనాధీనం.. కాలువ, కుంట, చెరువు, స్వర్ణముఖి నదీ పోరంబోకు భూములను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నారు. ఈ మూడేళ్లలో కోట్ల రూపాయల విలువజేసే సుమారు 259 ఎకరాలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వ భూములని తెలియక కొనుగోలు చేసిన అనేకమంది బాధితులు పట్టాల కోసం నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తిరుపతి రూరల్ పరిధిలో భూమాయగాళ్లపై ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్ స్పెషల్ ఫోకస్.. సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: విభజన తర్వాత తిరుపతికి అత్యంత ప్రాధాన్యత పెరిగింది. ఏడుకొండల వాడి చెంత ఇంత చోటుంటే చాలనుకునేవారు నానాటికీ పెరుగుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన అనేక మంది వ్యాపారులు తిరుపతిలో నివాసాల ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వీరి అవసరాలు.. భూములకు పెరుగుతున్న డిమాండ్‌ను అధికార పార్టీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక టీడీపీ నేతలు వారి అనుచరుల ద్వారా ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమాల అడ్డా అవిలాల తిరుపతి సమీపంలోని అవిలాల రెవెన్యూ పరిధిలోని వేదాంతపురం పంచాయతీ సర్వే నం.360లో 178 ఎకరాలు వంక, కాలువ పోరంబోకు భూములతో పాటు ప్రభుత్వ భూమి ఉంది. కాలువ, స్వర్ణముఖి నదికి మధ్యలో ఉన్న ఈ భూమిని అధికార పార్టీకి చెందిన నాయకులు ఇద్దరు ప్లాట్లు వేసి విక్రయించారు. అందుకోసం ముగ్గురు బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్లాటు కొనుగోలు చేసిన వారికి దగ్గరుండి తాత్కాలిక షెడ్లు వేయిస్తుంటారు. ప్లాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వందకుపైగా నివాసాలున్నాయి. మరికొన్ని నిర్మాణాలు సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నిర్వాకం.. శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సుమారు రూ.15 కోట్లు విలువచేసే చెరువును ఆక్రమించుకున్నారు. అవిలాల రెవెన్యూలోని సర్వే నం.377లో 12 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన ఓటేరు చెరువును ఆ ఎమ్మెల్యే దర్జాగా కబ్జా చేశారు. చెరువు ఆక్రమణ విషయం అధికారులకు తెలిసినా ఎవ్వరూ నోరెత్తలేదు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో చెరువును పూడ్చేందుకు ప్రయత్నించారు. టిప్పర్లతో మట్టి తెచ్చి జేసీబీలతో పూడ్చివేస్తున్నా అడ్డుకునేందుకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు. బండ పోరంబోకుపై భూరాబందులు సర్వే నం.250లో 6.3 ఎకరాల బండ పోరంబోకు స్థలం ఉంది. ఇందులో 26 మంది గంగిరెద్దుల కుటుంబాల వారికి పట్టాలిచ్చారు. ఈ పట్టాలను సాకుగా చూపించి మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఒకరు పెద్ద ఎత్తున విక్రయాలకు తెరదీశారు. పక్కనే శ్మశానం ఉన్నా దాన్ని కూడా ఆక్రమించి రెండు సెంట్ల స్థలాన్ని రూ.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రామ..రామా! రామచంద్రయ్య కాలనీలో సర్వే నం.222, 223/2, 224, 225లో సుమారు 5 ఎకరాల కాలువ పోరంబోకు భూమి ఉంది. ఇందులో 62 మందికి పట్టాలు మంజూరు చేశారు. వారి పేర్లు చెప్పుకుని మాజీ మంత్రి అనుచరుడు 2 సెంట్ల స్థలాన్ని రూ.5 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. భూమంత్రకాళి.. రామదాసు కాలనీలో సర్వే నం.230/1, 230/2, 231/3లలో మరో 4.5 ఎకరం బండ పోరంబోకు భూమి ఉంది. ఇందులో కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు ఇచ్చి మిగిలిన భూమిని అమ్ముకున్నారు. మరికొంత భూమిలో హౌసింగ్ స్కీంలో పక్కాగహాలు నిర్మించి అమ్ముకున్నారు. తిరుమలలోని పాపవినాశనంలో దుకాణాల తొలగింపుతో నష్టపోయిన వారికి వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.233/2, 232లో 1.5 ఎకరాల్లో 43 మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారు. తిరుచానూరు సమీపంలో సర్వే నం.479లో 36 ఎకరాల స్వర్ణముఖి నది పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. రెండేళ్ల క్రితం లోతట్టు ప్రాంతంలో జేసీబీలు పెట్టి చదును చేయించుకున్నారు. ఆక్రమించుకున్న ప్రాంతంలో ప్రహరీ గోడ కూడా నిర్మించుకోవడం గమనార్హం. ఆక్రమణల గురించి తమకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదని రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. బరితెగిస్తున్న మాజీ మంత్రి అనుచరులు.. తిరుపతి రూరల్ మండల పరిధిలో మాజీ మంత్రి అనుచరులు ఇద్దరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.203/2, 204/1లో సుమారు 5 ఎకరాల కాలువ పోరంబోకు ఉంది. రూ.5 కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని ప్లాట్లు వేసి విక్రయించుకున్నారు. మరికొన్ని ప్లాట్లలో వారే నివాసాలు నిర్మించి అమ్ముకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 162 నివాసాలున్నాయి. దీనికి విజయనగర కాలనీగా నామకరణం చేశారు. ఇవి మొత్తం అక్రమమేనని అధికారులు స్పష్టం చేశారు. ఇదే కాలనీలో సర్వే నం.208లో ఉన్న మరో 2.5 ఎకరాల కాలువ పోరంబోకును కూడా ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వే నం.246, 247లో మరో 5 ఎకరాల కాలువ పోరంబోకు భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధమైంది. -
అమ్మ పై లైంగిక దాడి, అమ్మమ్మహత్య
వాషింగ్టన్: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో కెవిన్ హావ్లో(23) అనే యువకుడు అమ్మ, అమ్మమ్మలపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆందోళన రేకెత్తించింది. గర్ల్ ఫ్రెండ్‌తో ఇంట్లోకి రానివ్వలేదనే ఉన్మాదంతో రెచ్చిపోయిన కెవిన్ అమ్మపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అమ్మ తప్పించుకోవడంతో అమ్మమ్మను అమానుషంగా హత్య చేశాడు. పోలీసులను సైతం నివ్వెరపర్చిన ఈ సంఘటన లోయర్ ఆక్స్ఫర్డ్ టౌన్ షిప్ లో మంగళవారం జరిగింది. మత్తు పదార్థాలు సేవించి, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వచ్చిన కొడుకును ఇంట్లోకి రావడానికి తల్లి నిరాకరించడంతో ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కెవిన్ తల్లిపై కిరాతకంగా దాడిచేశాడు. లైంగికంగా వేధించాడు. ఎలాగో ఆమె తప్పించుకుని పారిపోయింది. దీంతో మరింత ఉన్మాదిలా మారిపోయాడు కెవిన్. 80 ఏళ్ల వృద్ధురాలైన అమ్మమ్మపైనా దాడికి దిగాడు. అత్యాచారయత్నం చేశాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఆమెను దారుణంగా కత్తితో అనేకసార్లు పొడిచాడు. దీంతో షాకైన కెవిన్ సోదరి పోలీసులకు ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలొదిలింది. కెవిన్ ను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హత్యలు, అత్యాచార వార్తలు ఆందోళనకు గురి చేసే మాట నిజమే కానీ, ఈ ఘటన మనసును కలిచి వేసిందని పోలీసు ఉన్నతాధికారి జెర్మీ రిచర్డ్ వ్యాఖ్యానించారు.