ప్రాంక్‌ వీడియో.. చితకబాదిన ప్రయాణికులు | Begging For Prank Video Young People Behaves Indecently | Sakshi
Sakshi News home page

ప్రాంక్‌ వీడియో.. చితకబాదిన ప్రయాణికులు

Published Fri, Apr 8 2022 10:04 AM | Last Updated on Sat, Apr 9 2022 3:28 PM

Begging For Prank Video Young People Behaves Indecently  - Sakshi

జడ్చర్ల: ప్రాంక్‌ వీడియోకోసం భిక్షాటన చేస్తూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి యువకులు దెబ్బలు తిన్న ఘటన జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా కొందరు యువకులు ప్రయాణికుల దగ్గరకు వచ్చి భిక్షాటనతో హడావుడి చేశాడు.

డబ్బులు ఇవ్వని వారి పాదాలను పట్టుకున్నారు. మహిళల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రవర్తన హద్దు మీరడంతో అక్కడున్న ప్రయాణికులు వారిని పట్టుకుని చితక బాదారు. దీంతో తాము ప్రాంక్‌ వీడియోలు చేస్తున్నామని, ఈ సన్నివేశాలను తమ మిత్రులు రహస్యంగా చిత్రీకరిస్తున్నారని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో సదరు యువకులు ప్రయాణికులకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు.

(చదవండి: యాప్స్‌తోనే లక్ష్మీపతి నెట్‌వర్క్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement