indecent behaviour
-
కోరిక తీర్చాలంటూ వివాహితకు వేధింపులు
ముత్తారం (మంథని): పరుష పదజాలంతో దూషించడంతోపాటు అసభ్య సైగలు చేస్తూ ఓ కామాంధుడు తన కామవాంఛ తీర్చాలని వివాహితను వేధించాడు.. అడ్డుకోబోయిన మరో మహిళపై సైతం దాడిచేశాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం తన బాబును ఇంటి ఎదుట ఆడిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఎర్రం సురేశ్ అక్కడకు చేరుకుని ఆమెను బూతులు తిడుతూ, అసభ్య సైగలతో కామవాంఛ తీర్చాలని వేధించాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన సురేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి రాత్రి సమయంలో తన సహచరుడు రేగల గట్టయ్యతో కలిసి సురేశ్ కారులో మళ్లీ యువతి ఇంటికి చేరుకున్నాడు. సురేశ్, గట్టయ్య కలిసి ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డువచ్చిన స్థానికుడు బియ్యని కృష్ణస్వామిపై దాడికి దిగారు. తన భర్తను ఎందుకు కొడుతున్నావని కృష్ణస్వామి భార్య నవలోక దుండగులను ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన సురేశ్ గట్టయ్య సాయంతో కారు డోర్లో నవలోక చెయ్యి ఇరికించి సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు బైక్‌లతో వెంబడించినా నిందితుల ఆచూకీ లభించలేదు. తీవ్రంగా గాయపడ్డ నవలోకను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వివాహిత, బాధిత మహిళ కుటుంబ సభ్యులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కారు దగ్ధం.. స్థానికులు వెంబడించడంతో నిందితులు తమ కారులో మైదంబండ నుంచి మచ్చుపేట, లక్కారం మీదుగా సర్వారం వెళ్లే రోడ్డు మీదుగా పరారయ్యారు. చివరికి సర్వారంలోని ఓ డ్రైనేజీలో కారు దిగబడి ఆగిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు తప్పించుకుని పారిపోయారు. అయితే, తెల్లవారేసరికి కారు కాలిపోయింది. ప్రమాదవశాత్తు కాలిపోయిందా, లేదా ఎవరైనా కాల్చివేశారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాంక్ వీడియో.. చితకబాదిన ప్రయాణికులు
జడ్చర్ల: ప్రాంక్ వీడియోకోసం భిక్షాటన చేస్తూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి యువకులు దెబ్బలు తిన్న ఘటన జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా కొందరు యువకులు ప్రయాణికుల దగ్గరకు వచ్చి భిక్షాటనతో హడావుడి చేశాడు. డబ్బులు ఇవ్వని వారి పాదాలను పట్టుకున్నారు. మహిళల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రవర్తన హద్దు మీరడంతో అక్కడున్న ప్రయాణికులు వారిని పట్టుకుని చితక బాదారు. దీంతో తాము ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని, ఈ సన్నివేశాలను తమ మిత్రులు రహస్యంగా చిత్రీకరిస్తున్నారని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో సదరు యువకులు ప్రయాణికులకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. (చదవండి: యాప్స్‌తోనే లక్ష్మీపతి నెట్వర్క్) -
పెళ్లింట్లో అసభ్య ప్రవర్తన, హిజ్రాల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు వారికి సహకరించిన ఆటో డ్రైవర్లను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతినగర్ ఆర్.కె.లేఅవుట్‌కు చెందిన ప్రేవేటు ఉద్యోగి పంచాంగం చలపతి ఈనెల 24న తన కుమారుడి వివాహం జరిపించాడు. 25న ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే క్రమంలో 8 మంది హిజ్రాలు ఆయన ఇంటికి వచ్చి రూ.20 వేలు డబ్బులు డిమాండ్ చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. భయపడిన చలపతి కుటుబ సభ్యులు వారికి రూ.16,500 ఇవ్వడంతో వెళ్లిపోయారు. ఈ విషయంపై బాధితుడు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రగతినగర్ ఎలీప్ చౌరస్తాలో టీఎస్15 యూడీ 0298 ఆటోలో వెళ్తున్న 8 మంది హిజ్రాలను, ఆటో డ్రైవర్లు కరణ్ గుప్త, మొహమ్మద్ మాసీలను అరెస్టు చేశారు. ఈ విషయమై మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అమాయకులను వేధించే ట్రాన్స్జెండర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేయాలని, లేదా వాట్సాప్ నెంబర్ 94906 17444కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఉద్యోగినిని లోబరుచుకునేందుకు విందు..!
సాక్షి, కరీంనగర్ : చొప్పదండి మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ వింతప్రవర్తన వివాదాస్పదంగా మారింది. మహిళా ఉద్యోగిని లోబరుచుకునేందుకు విందు ఏర్పాటు చేశారని స్థానికంగా విమర్శలున్నాయి. తొలుత ఫోన్లో ఆమెను లోబర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో విందు భోజనం పేరుతో ఉద్యోగులందరినీ ఆయన ఇంటికి పిలిచారని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను విందుకు ఆహ్వానించారని సమాచారం. ఈ తతంగం నచ్చని ఓ మహిళా ఉద్యోగి మీడియాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి మీడియా వెళ్ళడంతో కమిషనర్ పరార్ అయ్యారు. ఇటీవలనే మున్సిపాలిటిగా ఏర్పడిన చొప్పదండికి కమిషనర్‌గా 15రోజుల క్రితం హైదరాబాద్ నుంచి నిత్యానంద్ బదిలీపై వచ్చారు. అప్పటి నుంచే మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ క్రింద పనిచేసే మహిళా ఉద్యోగులపై కన్నేశాడని సమాచారం. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగినిలకు గిఫ్ట్‌లు ఇచ్చేవారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్‌లను నిరాకరిస్తే పలు రకాలుగా వేధించేవారని విమర్శలున్నాయి. నిత్యానంద్ మహిళలను టార్గెట్ గా చేసుకొని వింతగా ప్రవర్తిస్తున్నారని విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
డాన్సర్లతో ఎమ్మెల్యే చిందులు.. వీడియో వైరల్
-
బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన
కోహీర్: విచక్షణ లేని ఓ వృద్ధుడు ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి అందించిన సమాచారం ప్రకారం.. గురుజువాడకు చెందిన శివకుమార్ (56).. గ్రామంలో ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి గ్రామ శివారులో ఉన్న పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. శివకుమార్ తీరును గమనించిన సమీపంలోని రైతు ఒకరు సెల్‌ఫోన్ ద్వారా బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పొలానికి చేరుకొని తన కుతూరును చేరదీసి శివకుమార్‌ను చితకబాదారు. గ్రామానికి తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం వద్ద నిర్బంధించారు. కోహీర్ ఎస్ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో తన సిబ్బందితో గురుజువాడకు వెళ్లారు. బాలిక కుటుంబసభ్యులకు నచ్చచెప్పి వారి అదుపు నుంచి నిందితుడు శివకుమార్‌ను విడిపించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
కటకటాల్లోకి కీచక టీచర్
విద్యార్థినితో అసభ్య ప్రవర్తన పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు? సిద్దిపేట రూరల్: విద్యార్థిని అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓ ఉపాధ్యాయుడు వేకిలి వేషాలు వేసి కటకటాలపాలయ్యాడు. గురువు వృత్తికే మచ్చతెచ్చిన సదరు కీచక చీటర్ గుట్టు బుధవారం రట్టు అయ్యింది. ఈ సంఘటన సిద్దిపేటలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఒన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు... పట్టణంలోని రాంనగర్‌కు చెందిన యువతి(17) ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమె పదో తరగతి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివింది. ఆ సమయంలో అదే స్కూల్లో పనిచేస్తున్న గణితం ఉపాధ్యాయుడు రాంచంద్రం.. విద్యార్థిని లెక్కల్లో వచ్చిన సందేహాలను ఇంటికి రప్పించుకొని నివృతి చేసేవాడు. ఈక్రమంలో బాలికను మభ్యపెట్టి పలుమార్లు లోబరుచుకున్నాడు. పదో తరగతి టీసీ విషయంలోనూ ఇంటికి వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న బాధిత యువతి పాఠ్యంశానికి సంబంధించిన అనుమానాలను నివృతి చేసుకోవడానికి మరోసారి సదరు ప్రబుద్ధుడి దగ్గరకు వెళ్లింది. పాత పరిచయంతో ఉపాధ్యాయుడు తిరిగి యువతితో అనుచితంగా వ్యవహరించాడు. దీంతో విసిగిపోయిన బాధిత యువతి.. తల్లిదండ్రులతో కలిసి మంగళవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు రాంచంద్రం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
64 మంది ఆకతాయిల అరెస్టు
ముంబయి: అసభ్యంగా ప్రవర్తిస్తున్న 64మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారికి కొంత మొత్తంలో ఫైన్ వేసి, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించి పంపించారు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదా ఐలాండ్, అక్సా బీచ్ వద్ద గల కొన్ని హోటల్లలో కొంతమంది యువతీయువకులు జంటలుగా ఏర్పడి అసభ్యంగా ప్రవర్తిస్తూ తోటివారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆ ప్రాంతంలోని హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు రిసార్టులపై దాడులు నిర్వహించి మొత్తం 64మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరికి రూ.1200 ఫైన్ వేయడంతోపాటు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి నేరుగా కౌన్సెలింగ్ ఇప్పించి పంపించేశారు. -
అసభ్య టీచర్ పై కేసు
హైదరాబాద్: పాత కక్షలను మనసులో పెట్టుకుని ఫోన్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడకు చెందిన పి.రాజేశ్వరి(28) నగరంలో అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో పనిచేసిన నల్లగొండ జిల్లా పోచంపల్లికి చెందిన గడ్డం వెంకటేష్ తరచూ రాజేశ్వరికి ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. -
పూనమ్ పాండే అసభ్య ప్రవర్తన.. అరెస్టు
టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే చాలు.. బట్టలిప్పేస్తానంటూ బహిరంగంగా ప్రకటనలు చేసి, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటీమణి పూనం పాండేను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ముంబైలోని మీరా రోడ్డులో ఆమెకు అరదండాలు వేశారు. బహిరంగం ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పూనమ్ పాండేపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం పోలీసులు ఆమెను గట్టిగా హెచ్చరించి, వదిలిపెట్టారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చిట్టచివరిసారిగా పూనమ్ పాండే బాలీవుడ్లో నటించిన సినిమా.. నషా. ఆ తర్వాత ఆమెకు సినిమా ఛాన్సులు కూడా ఏమీ రాలేదు. దాంతో ఇలా ఏదో ఒక పిచ్చిపని చేసి వార్తల్లో ఉండాలన్నదే ఆమె లక్ష్యంలా కనిపిస్తోంది. -
మీడియాపై కాంగ్రెసోళ్ల చిందులు
మీడియాలో కనిపించాలని నానా తంటాలు పడుతుంటారు రాజకీయ నాయకులు. రకరకాల వేషాలు వేసి, నాటకాలు ఆడైనా కూడా కాసేపు మీడియాలో ఏదో ఒక రకంగా ప్రచారంలో ఉంటే చాలనుకుంటారు. కానీ అదే మీడియాపై ఈ మధ్యకాలంలో మాత్రం పలువురు కాంగ్రెస్ నాయకులు మీడియా కనపడితే చాలు.. గయ్యిమని ఒంటికాలిమీద లేస్తున్నారు. పదే పదే మీడియామీద మండి పడటమే పనిగా పెట్టుకుంటున్నారు. నిన్నకాక మొన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విలేకరుల సమావేశం పెట్టి మరీ అందరినీ పిలిచి, సాక్షి మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన నుంచి స్ఫూర్తి పొందారో ఏంటో గానీ.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మీడియా మీద మండిపడ్డారు. నోటికి వచ్చినట్లల్లా మాట్లాడారు. అంతేకాదు వేలు చూపించి మరీ బెదిరించారు. ''అసలు వీళ్లతో మాట్లాడటం దండగ'' అని వ్యాఖ్యానించారు. అదేంటి అలా అంటున్నారు, మీరు ఇలా మాట్లాడటం సరికాదని కొంతమంది మీడియా ప్రతినిధులు అన్నా కూడా వేలు పెట్టి బెదిరించినట్లు చూపించి మరీ వ్యాఖ్యానాలు చేశారు. ''మేం మా ముఖ్యమంత్రితో ఏమైనా మాట్లాడతాం. నా నోరు.. నా ఇష్టం. మీకు ఇష్టం వచ్చినది రాసుకోండి'' అంటూ విసురుగా ప్రవర్తించారు. ఈనెల ఏడో తేదీన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌లో అల్లకల్లోలం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘అల్లకల్లోలం ఎవరు చేస్తారు?’ అని ఇద్దరు విలేకరులు ప్రశ్నించారు. దీనికి సరైన సమాధానమివ్వని లగడపాటి.. సమావేశం తర్వాత వారితో వాగ్వాదానికి దిగారు. అవివేకంగా మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రశ్నలు అడిగితే అవివేకం అంటారేమిటి?’ అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో లగడపాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘నోర్ముయ్... నీ పేరేంటి? నీ ఏరియా ఏంటి?’’ అంటూ ఊగి పోయారు. ‘‘అవసరమైతే చేతులు లేస్తాయి’’ అంటూ చిందులుతొక్కారు. తన వాహనం ఎక్కుతూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ‘‘నా సంగతేంటో చూపిస్తా... మీ అంతు చూస్తా!’’ అని నిష్ర్కమించారు. తమకు అవసరమైనప్పుడు, తాము కావాలనుకున్నప్పుడల్లా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి అందరినీ పిలిచి మరీ గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇచ్చే బొత్స, లగడపాటి లాంటి నాయకులు తమకు ఏమాత్రం కాస్త వ్యతిరేకంగా అనిపించినా ఇలా చిందులు తొక్కుతూ రచ్చరచ్చ చేస్తున్నారు.