హైదరాబాద్: పాత కక్షలను మనసులో పెట్టుకుని ఫోన్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడకు చెందిన పి.రాజేశ్వరి(28) నగరంలో అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో పనిచేసిన నల్లగొండ జిల్లా పోచంపల్లికి చెందిన గడ్డం వెంకటేష్ తరచూ రాజేశ్వరికి ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.