
పాఠశాలలో విచారణ చేస్తున్న ఎంఈవో
మోర్తాడ్(బాల్కొండ): తనతోటి ఉపా ధ్యాయుడు తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ ఉపాధ్యాయిని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఏర్గట్ల మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం ఏర్గట్ల పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. ఉన్నత పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలితో బయోసైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు శాంతికుమార్ కొన్నినెలల నుంచి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఉపాధ్యాయురా లి సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లతోపాటు, ఫొటోలను పంపించేవాడు. దీం తో ఉపాధ్యాయురాలు తన భర్తకు, కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశారు. కాగా శాంతికుమార్ గతంలో ధర్మారం బీ పాఠశాలలో ఇలాగే వ్య వహరించడంతో అతనికి అక్కడ దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. కేసు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. అలాగే ఎంఈవో బి. రాజేశ్వర్ పాఠశాలలో విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment