అమ్మ పై లైంగిక దాడి, అమ్మమ్మహత్య | Man killed grandmother after trying to rape her and his mother - police | Sakshi
Sakshi News home page

అమ్మపై లైంగిక దాడి, అమ్మమ్మ హత్య

Published Thu, Jan 21 2016 2:24 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

అమ్మ పై లైంగిక దాడి, అమ్మమ్మహత్య - Sakshi

అమ్మ పై లైంగిక దాడి, అమ్మమ్మహత్య

వాషింగ్టన్: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో కెవిన్ హావ్లో(23) అనే యువకుడు అమ్మ, అమ్మమ్మలపై  లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆందోళన రేకెత్తించింది. గర్ల్ ఫ్రెండ్తో ఇంట్లోకి రానివ్వలేదనే ఉన్మాదంతో రెచ్చిపోయిన  కెవిన్ అమ్మపై  లైంగిక దాడికి ప్రయత్నించాడు. అమ్మ తప్పించుకోవడంతో అమ్మమ్మను అమానుషంగా హత్య చేశాడు. పోలీసులను సైతం నివ్వెరపర్చిన ఈ సంఘటన లోయర్ ఆక్స్ఫర్డ్ టౌన్ షిప్ లో మంగళవారం  జరిగింది.

మత్తు పదార్థాలు సేవించి, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వచ్చిన కొడుకును ఇంట్లోకి రావడానికి తల్లి నిరాకరించడంతో ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కెవిన్ తల్లిపై కిరాతకంగా దాడిచేశాడు. లైంగికంగా వేధించాడు.  ఎలాగో ఆమె తప్పించుకుని పారిపోయింది. దీంతో మరింత ఉన్మాదిలా మారిపోయాడు కెవిన్.  80 ఏళ్ల  వృద్ధురాలైన అమ్మమ్మపైనా దాడికి దిగాడు. అత్యాచారయత్నం చేశాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఆమెను దారుణంగా కత్తితో  అనేకసార్లు పొడిచాడు. దీంతో షాకైన కెవిన్ సోదరి పోలీసులకు ఫోన్ చేసింది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలొదిలింది. కెవిన్ ను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హత్యలు, అత్యాచార వార్తలు ఆందోళనకు గురి చేసే మాట నిజమే కానీ, ఈ ఘటన మనసును కలిచి వేసిందని పోలీసు ఉన్నతాధికారి జెర్మీ రిచర్డ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement