వాషింగ్టన్: కోవిడ్ సోకిన ఓ వ్యక్తికి వైరస్ నుంచి విముక్తి లభించినా, బల్ రూపంలో భారీ షాక్ ఎదురైంది. ట్రీట్‌మెంట్ అనంతరం ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన బిల్ చూడగానే అతని మైండ్‌బ్లాంక్ అయింది. దేవుడా.. అంటూ గుండె పట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3 మిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.22 కోట్లండి. ఇక ఆ బిల్లును సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధను నెటిజన్లతో పంచుకున్నాడు.
అమెరికాలో ఓ వ్యక్తి కరోనా సోకిందని ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో నాలుగు నెలల చికిత్స అనంతరం అతను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇక డిశ్చార్జ్ సమయంలో అతనికిచ్చిన 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్ చూసి బెంబేలిత్తిపోయాడు. ఆ రసీదుని వీడియో తీసి ‘టిక్‌టాక్’లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి కొద్ది రోజుల్లోనే దాదాపు 10 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించుకుంది. కాగా అగ్రరాజ్యంలో వైద్యం కోసం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రపంచంలోనే అత్యత్తమ సౌకర్యాలు, వైద్య సదుపాయాలు ఉంటాయి. అందుకే ఆ దేశంలో ఆరోగ్య బీమా తీసుకుంటే ఆస్పత్రుల్లో భారీగా బిల్లు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment