సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఆసుపత్రిలో స్ట్రెచర్లు లేక రోగి కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనానికి ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు వద్ద ఓకే చోట 10 నుంచి 16 స్ట్రెచర్లు 5 వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా దర్శనం ఇస్తున్న స్ట్రెచర్లు, వీల్ చైర్‌లు చూసి రోగుల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి వరకూ ఇన్ని స్ట్రెచర్లు కంటికి కనిపించలేదని అవాక్కవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కలెక్టర్ హనుమంతు ఆసుపత్రికి వచ్చి పరిశీలించాలని రోగుల బంధువుల డిమాండ్ చేస్తున్నారు. కాగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment