తాళం వేసిన ఆస్పత్రి ముందు ఆటోలో బాధితుడు ఎల్లప్ప
కోస్గి: మున్సిపల్ పరిధిలోని తిమ్మాయపల్లికి చెందిన ఓ వ్యక్తి వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి రావడంతో ఆస్పత్రి సమయం అయిపోయిందని, సాయంకాలం వస్తేనే వైద్యం చేస్తామని చెప్పి వైద్యానికి నిరాకరించిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. తిమ్మాయపల్లికి చెందిన ఎల్లప్ప రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలికి గాయాలయ్యాయి. కొంతకాలు భాగం తీసివేశారు. ఒకరోజు విడిచి ఒకరోజు గాయాన్ని శుభ్రం చేసి కట్టు కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నడవలేని స్థితిలో ఓ ఆటోలో కట్టు కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. మధ్యాహ్నం 2గంటలకు ఆస్పత్రికి వచ్చాడు.
దీంతో ఆస్పత్రి సమయం అయిపోయిందని, సాయంత్రం 4 గంటలకు రావాలని సిబ్బంది చెప్పారు. వైద్యం చేయడానికి నిరాకరించారు. నడవలేని స్థితిలో ఉన్నాడని, కట్టుకడితే వెళ్తామని బాధితులు ప్రాధేయపడినా వినిపించుకోలేదు. ఆస్పత్రి వేళల్లో వస్తేనే వైద్యం చేస్తాం.. మీ ఇష్టం వచ్చినట్లు వస్తే చేయం. ఎవరికై నా చెప్పుకోండి అంటూ రోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక బాధితుడు ఎల్లప్ప ఇంటికి వెళ్లిపోయాడు. ఈవిషయమై ఆస్పత్రి వైద్యుడు అనుదీప్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేడు.
Comments
Please login to add a commentAdd a comment