hospital staff
-
పసికందు కోసం కన్నతండ్రి కష్టం..
-
సాక్షి ఎఫెక్ట్: రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగింది?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఆసుపత్రిలో స్ట్రెచర్లు లేక రోగి కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనానికి ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు వద్ద ఓకే చోట 10 నుంచి 16 స్ట్రెచర్లు 5 వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా దర్శనం ఇస్తున్న స్ట్రెచర్లు, వీల్ చైర్లు చూసి రోగుల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ ఇన్ని స్ట్రెచర్లు కంటికి కనిపించలేదని అవాక్కవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కలెక్టర్ హనుమంతు ఆసుపత్రికి వచ్చి పరిశీలించాలని రోగుల బంధువుల డిమాండ్ చేస్తున్నారు. కాగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమ్మర్ టూర్.. వెరీ ‘హాట్’ గురూ! -
ఉస్మానియాలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్ర పరుస్తానంటూ మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని సోమవారం రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని భీష్మించాడు. ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు మంగళవారం ఉదయం అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.... ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంత టి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆసుపత్రి గ్రేవియన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఔట్‌పేషెంట్ బ్లాకు, ఆర్ఎంఓ రూమ్ దగ్గర ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశామని సలహాలు, సూచనలతో పాటు తమ ఫిర్యాదులను ఆ బాక్సులో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. (చదవండి: టార్చర్ ఫ్రమ్ హోమ్!) -
‘క్వార్టర్ మందైనా, డబ్బులైనా ఇవ్వాలి’ రోగి బంధువుపై వైద్య సిబ్బంది చిందులు
సాక్షి. విశాఖపట్నం: అప్పుడే 72 ఏళ్ల వృద్ధుడికి శస్త్రచికిత్స అయింది. 50–50 చాన్స్‌తో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రోగి బంధువులు తీవ్ర వేదనలో ఉన్నారు. వీరి బాధలు అక్కడ (శస్త్రచికిత్స గది) వార్డు బాయ్‌కు పట్టడం లేదు. వార్డుకు షిఫ్ట్ చేయాలి. క్వార్టర్ బాటిల్ ఇస్తారా? లేదా డబ్బులైనా ఇస్తారా? అంటూ భీష్మించాడు. తమవారు వచ్చిన వెంటనే ఇస్తారని చెప్పినా కనికరించలేదు. ఇది కేజీహెచ్‌లో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ వద్ద శుక్రవారం కనిపించిన దృశ్యం. నగరానికి చెందిన ఎల్. అప్పారావు(72)కు గత శుక్రవారం కడుపు నొప్పి సమస్యతో సమీపంలో వైద్యులను సంప్రదించారు. మోషన్ అయ్యేందుకు మందులు వాడినా తగ్గలేదు. అనంతరం స్పెషలిస్ట్ వైద్యుడి సూచన మేరకు ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలు చేయించారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. దీంతో గత మంగళవారం కేజీహెచ్ ఎస్–4 వార్డులో చేర్పించారు. అక్కడ మరికొన్ని పరీక్షలు చేశారు. రిపోర్టుల ఆధారంగా అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. సర్జరీ మూడు గంటలపాటు జరిగింది. 7 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్ నుంచి రోగి తాలూకా ఎవరంటూ వార్డుబాయ్ పిలుపొచ్చింది. తామే అంటూ వెళ్లగా.. క్వార్టర్ బాటిల్ అయినా లేదా క్వార్టర్ బాటిల్‌కు డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇంతలో రోగి బంధువులు సెల్ఫోన్లో ఆ వ్యక్తి ఫొటో తీశారు. దీంతో వారిపై చిందులు వేస్తూ లోపలికి వెళ్లిపోయాడు. ‘మా బాధలో మేము ఉండగా, మద్యం సేవించి ఆపరేషన్ థియేటర్లో ఉండడమే గాక.. మాపై విరుచుకుపడ్డాడు’ అని వాపోయారు. మహిళలపై వ్యంగ్యంగా మాట్లాడుతున్న ఆపరేషన్ థియేటర్ ఉద్యోగి -
షాకింగ్ వీడియో: డ్యూటీకి డుమ్మా కొట్టిన నర్సు.. మరునాడు ఆస్పత్రికి వెళ్లగా
Hospital staff member attacking the woman: బీహార్‌లోని జాముయి జిల్లాలోని గ్రాస్రూట్లో ఒక మహిళా నర్సు ఒకరోజు విధులకు హాజరుకానందుకు సదరు ఆసుపత్రి సిబ్బంది మందలించారు. అంతేకాదు విధులకు హాజరు కానట్లయితే తొలగిస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఇంతలో ఒక వ్యక్తి సదరు నర్సు పై అరవడం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి నర్సుపై దాడికి దిగాడు. (చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!) దీంతో పక్కనే ఉన్న సహోద్యోగులు జోక్యం చేసుకోవడంతో గోడవ కాస్త సద్దుమణిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆస్పత్రి సిబ్బంది ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో సదరు వ్యక్తి గొడవ పెద్దదవుతుందంటూ అధికారికి తెలియజేశాడు. ఇక ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆ నర్సు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఆరోగ్య సిబ్బంది పాత్ర పాత్ర చాలా కీలకం. (చదవండి: ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్) वैक्सिनेशन के काम में लगे एक एएनएम के साथ जमुई ज़िले के चकाई रेफ़रल अस्पताल के वरीय स्टाफ़ कैसे मारपीट कर रहे हैं देखिए इसका एक विडीओ @ndtvindia @Anurag_Dwary @Suparna_Singh pic.twitter.com/HMPnQmJU9X — manish (@manishndtv) January 7, 2022 -
Corona patients: ఆక్సిజన్ అందక.. లైన్లో ఉండలేక..
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్): ‘సమయం మధ్యాహ్నం 12.50 గంటలు.. పాతబస్తీ నుంచి 26 ఏళ్ల యువతిని కుటుంబ సభ్యులు కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 78 నుంచి 84 మధ్య ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఎమర్జెన్సీ అమ్మా.. తొందరగా అడ్మిట్ చేసుకోండంటూ కుటుంబ సభ్యులు అక్కడున్న సిబ్బందిని ప్రాధేయపడ్డారు.ఎవరైనా ఒకటేనమ్మా లైన్లో నిలబడండి, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ స్లిప్ లెఫ్ట్‌లో ఉన్న క్యాబిన్లో ఇవ్వండనే సమాధానం వచ్చింది. అప్పటికే లైన్లో 15మందికి పైగా ఉన్నారు. వారందర్నీ రిక్వెస్ట్ చేసిన కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. స్లిప్ తీసుకుని ఎడమవైపు ఉన్న సమాచార క్యాబిన్లో ఉన్న నర్సులకు ఇచ్చారు. ఇక ఇక్కడ నిమిషాల కొద్దీ ఆలస్యం. సుమారు 45 నిమిషాల పాటు వెంట తెచ్చుకున్న ఆక్సిజన్ అయిపోతుంది, మహిళ తీవ్ర నిస్పృహకు గురవుతోంది. ఎంత వేడుకున్నా అస్సలు వినలేదు. 45 నిమిషాల తర్వాత ఒకేసారి ఐదుగురికి అడ్మిషన్ స్లిప్పులు ఇచ్చి 1.30గంటలకు పైకి పంపారు’. ‘వజ్రమ్మ వయస్సు 92 ఏళ్లు. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 86 నుంచి 80కి పడిపోతున్నాయని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె కుటుంబీకులు అడ్మిషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి అడ్మిషన్ స్లిప్ కోసం కనీసం 45 నిమిషాలకు పైగా వేచి చూశారు. ఓ పక్క వృద్ధురాలు వీల్‌చైర్‌లో అనేక అవస్థలు పడుతోంది. పెద్దామే బాధ చూడలేకపోతున్నాం.. త్వరగా అడ్మిట్ చేసుకోమని ప్రాధేయపడినా సరే.. అందరితో పాటే అడ్మిషన్ స్లిప్‌ని వృద్ధురాలికి కూడా ఇచ్చి పైకి పంపిన ఈ రెండు ఘటనలు బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలో చోటు చేసుకున్నాయి’. కంటతడి పెట్టిస్తున్న నిర్లక్ష్యం ఓ పక్క అయినవారు బతకాలనే ఆశ. మరో పక్క సిబ్బంది నిర్లక్ష్యం. ఈ రెండింటితో ఎవరిని ఏం అనాలో తెలియక పేషెంట్ల వెంబడి ఉన్న కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. సిబ్బందిపై కొద్దిగా కొప్పడితే బెడ్ ఇవ్వరేమో అనే భయం. కొద్దిగా ఓర్చుకో అమ్మా.. అంటూ పెషెంట్‌నిని ప్రాధేయపడుతున్న క్రమంలో.. ఆమె నిస్సాహాయకురాలిగా ఉంటుంది. కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్ల, నిత్యం వందలాది మందికి సర్వీస్ ఇవ్వడం వల్ల సిబ్బంది సైతం విసిగెత్తిపోతున్నారు. ప్రాణం పోతే ఆ బాధ, వేదన తమకే తెలుస్తోందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 15 నిమిషాల్లోనే అడ్మిట్ ఎవరినీ ఎక్కువ సేపు వెయిట్ చేయించేది లేదు. ఎమర్జెన్సీ ఉంటే పేషెంట్‌ని అడ్మిట్ చేసుకుని అడ్మిషన్ ప్రక్రియ వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది. కానీ.. ఉద్ధేశపూర్వకంగా ఎవరినీ ఎక్కువ సేపు వేచి ఉంచేలా చేయము. – డాక్టర్ రాజేంద్రనాథ్, కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ ( చదవండి: వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! ) -
కరోనా: జిల్లా ఆస్పత్రి సిబ్బందిపై దాడి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా ఆస్పత్రిలో కోవిడ్ నిబంధనల ప్రకారం ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై కొందరు విచక్షణరహితంగా దాడి చేశారు. టూటౌన్ సీఐ శ్రీనివాసాచారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో పట్టణంలోని కొత్త చెరువు రోడ్‌కు చెందిన కోట్ల బాలస్వామి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కుటుంబ సభ్యులు, బంధువులు చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో కొంత ఉపశమనం పొందాడు. ఈ విషయం తెలుసుకున్న అతనికి సంబంధించిన కొంత మంది వ్యక్తులు ఒకేసారి క్యాజువాలిటీ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ విధుల్లో సెక్యూరిటీ సూపర్వైజర్ దేవానంద్, వార్డ్బాయ్ శంకర్లు వారిని వారించారు. ఇంతమంది కరోనా సమయంలో ఒకేసారి లోపలికి వెళ్లరాదని వారించారు. అక్కడ ఉన్న కొంత మంది శంకర్‌ను గుర్తు తెలియని ఆయుధంతో తలపై కొట్టడంతో రక్తగాయాలయ్యాయి, దేవానంద్‌పైనా దాడి చేసి గాయపర్చారు. డ్యూటీలో ఉన్న వైద్యుడిపై దౌర్జన్యంగా మాట్లాడటంతో పాటు అతని విధులకు ఆటంకం కల్గించారు. ఆర్ఎంఓ సాయిబాబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పడకుల ప్రకాష్, మహేష్,కోట్ల నర్సింహులు, వెంకటేష్, రమేష్, శ్రీధర్, మెకానిక్ శ్రీను, మెకానిక్ బాలస్వామి, బాలరాజ్‌లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సిబ్బంది నిరసన జిల్లా జనరల్ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఆస్పత్రి శానిటేషన్ సూపర్వైజర్ దేవానంద్, వార్డుబాయ్ శంకర్‌లపై అకార ణంగా దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమవా రం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్క్‌ర్స్ యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి , సభ్యులు పాల్గొన్నారు. -
'రిఫర్' చేస్తే లక్ష..!
డాక్టర్ జయచంద్ర (పేరు మార్చాం) హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్ నడుపుతున్నాడు. క్లినిక్‌కు వచ్చే కరోనా అనుమానితులకు వెంటనే పరీక్షలు చేయిస్తాడు. పాజిటివ్ వచ్చి, లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తాడు. అలా చేసినందుకు సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రి ఒక్కో కేసుకు లక్ష రూపాయలు కమీషన్ కింద చెల్లిస్తుంది. ఇలా ఈయన ఇప్పటివరకు 150 కేసులు రిఫర్ చేసి, కోటిన్నర రూపాయలు మూటగట్టుకున్నాడు. వరంగల్ నగరంలో డాక్టర్ శ్రీనివాస్ (పేరు మార్చాం) నడిపే నర్సింగ్ హోంకు కరోనా చికిత్సచేసే అనుమతి లేదు. అయితే తన వద్దకు కరోనా అనుమానిత లక్షణాలతో ఎవరైనా వస్తే, తన వద్ద ఉన్న సీటీ స్కాన్‌తో కరోనా నిర్ధారణ పరీక్ష చేస్తాడు. పెద్దగా లక్షణాలు లేకున్నా.. పాజిటివ్ వస్తే చాలు సీరియస్‌గా ఉందంటూ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తాడు. ఇలా చేసినందుకు అతనికి ఇప్పటివరకు దాదాపు కోటి రూపాయల వరకు ముట్టాయి. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులతో కొం దరు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆడుకుంటు న్నారు. అంబులెన్స్ డ్రైవర్ మొదలు డాక్టర్ల వరకు పలువురు కరోనా కేసుల పేరుతో అంది నకాడికి దండుకుంటున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖకు ఫిర్యాదులందాయి. ‘కరోనా పాజిటివ్’ పేరుతో బాధితుల భయాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు నడిపే కొందరు డాక్టర్లు పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులతో ముందే ఒప్పందం కుదుర్చుకుని, తమ వద్దకు వచ్చే అనుమానిత కేసుల్ని రిఫర్ చేసి.. కేసుకు లక్ష రూపాయల చొప్పున కమీషన్‌గా అందుకుంటున్నారు. ఇటీవల జనగామలో ప్రభుత్వ డాక్టరే అక్ర మంగా అర్ధరాత్రుల్లో టెస్టులుచేసి హైదరా బాద్‌కు రిఫర్ చేస్తుండగా ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ‘రిఫరెన్స్’లకు రిజర్వుడ్ పడకలు రాష్ట్రంలో 170 ప్రైవేట్, కార్పొరేట్ సహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు చేస్తున్నారు. వీటిలో కరోనా పడకలు 9,058 ఉండగా, అందులో 4,061 పడకలు నిండిపోయాయి. ఇంకా 4,997 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1,786 ఐసీయూ పడకలకు 1,039, 4,003 ఆక్సిజన్ పడకలకు 2,115 ఖాళీగా ఉన్నాయి. అయితే పేరొందిన ఆసుపత్రుల్లో మాత్రం పడకలు ఖాళీగా ఉండట్లేదు. చాలామంది బాధితులు పేరున్న ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని భావిస్తు న్నారు. దీంతో వాటిలో ఖాళీ పడకలు తక్కువే ఉంటున్నాయి. అయితే పేరొందిన ఆసుపత్రు లకు పంపాలంటే రిఫరెన్స్ తప్పనిసరి కావడంతో దీన్నే కొందరు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. వారు ఎప్పుడు రోగిని పంపినా అవసరమైన బెడ్స్‌ను ఆయా ప్రముఖ ఆసుపత్రులు రిజర్వుడ్‌లో పెడుతున్నాయి. ఇక కొన్ని చిన్న ఆసుపత్రుల తోనూ కొందరు డాక్టర్లు, ప్రైవేట్ ప్రాక్టీషనర్లు ఒప్పందం చేసుకుంటున్నారు. వాటిలో ఖాళీలు అధికంగా ఉండటంతో ఆయా ఆసుపత్రుల పీఆర్వోలు జిల్లాల్లో ఉండే ఆసుపత్రులతో మాట్లాడి రోగులను తెప్పించుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి అక్కడా లక్ష రూపాయల వరకు కమీషన్ ముట్టజెపుతున్నారు. కొందరు డాక్టర్లు, ఇతర సిబ్బంది అయితే అటు ఆసుపత్రుల వద్ద, ఇటు రోగుల వద్ద రెండువైపులా గుంజుతున్నారు. కొందరు అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఒక్కో కేసుకు రూ.30,000 నుంచి రూ.50,000 వరకు గుంజుతున్నారు. ఆస్తులమ్ముకుంటున్న బాధితులు ఇలా ‘రిఫర్’గా వస్తున్న కేసుల్లోని బాధితుల్ని కొన్ని ఆసుపత్రులు నిండా పిండుతున్నాయి. ఆసుపత్రి స్థాయిని బట్టి రోజుకు లక్ష, వెంటలేటర్‌పై ఉంటే లక్షన్నర, సాధారణ బెడ్‌పై ఉంచినా రూ.75 వేల చొప్పున గుంజుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు ఆస్తులమ్ముకుంటున్నారు. ఇంకొందరు బంగారం, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెడుతుండగా, మరికొందరు అప్పులు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల ఈ దందాపై బాధితుల నుంచి వైద్య, ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
కరోనా కోరల్లో నిమ్స్!
కరోనా వైరస్ కబందహస్తాల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను అందించే నిమ్స్ ఆస్పత్రి విలవిలాడుతున్నది. సోమవారం నుంచి కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఫలితంగా ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, కార్మికులు కోవిడ్–19 వైరస్ బారిన పడుతున్నారు. వైద్యులకు నిమ్స్‌లోనే వైద్యం అందించి.. తమకు బయటి ఆస్పత్రుల్లో చికిత్స ఇప్పిస్తుండటంపై సిబ్బంది, కార్మికులు ఆందోళనకు దిగారు. లక్డీకాపూల్: కోవిడ్ బారినపడి ఇప్పటికే పది మందికిపైగా వైద్యులు చికిత్స పొందుతున్నారు. మరో 20 మందిని హోం క్వారంటైన్‌కి సిఫార్సు చేశారు. డాక్టర్స్ క్లబ్‌లోని రెసిడెంట్ డాక్టర్లందరూ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్టు విశ్వనీయ సమాచారం. దీంతో యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూడు కీలకమైన విభాగాలలోని వైద్యులు, సిబ్బంది, కార్మికుల నమూనాలను సేకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల నుంచి 20 మంది చొప్పున నమూనాలను సేకరించి కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. శుక్రవారం మహిళా వైద్యురాలితోపాటు మహిళా ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారం ఒక ప్రొఫెసర్, ముగ్గురు వైద్యులు, ఒక రోగి సహాయకునికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించారు. వీరికి నిమ్స్ మిలీనియం బ్లాక్‌లోని మొదటి అంతస్తులో చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శస్త్ర చికిత్సలను నిలిపివేశారు.(నిమ్స్‌లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా) నిమ్స్‌లో ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బంది ఇంత వివక్షనా! ఉద్యోగులు, సిబ్బందికి ఇతర ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. యాజమాన్య వైఖరిని ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం ఉదయం కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. తమకు కూడా వైద్యులతోపాటు కోవిడ్–19 చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లను సరఫరా చేయాలని కోరారు. కరోనాకు గురైన డాక్టర్లకు నిమ్స్‌లో వైద్యం.., మిగిలిన సిబ్బందికి బయట ఆస్పత్రుల్లో వైద్యమా? ఇదెక్కడి న్యాయం అంటూ ముక్తకంఠంతో యాజమాన్యాన్ని నిలదీశారు. కోవిడ్–19 బారిన పడిన నిమ్స్ సిబ్బందికీ నిమ్స్‌లోనే వైద్యం అందించాలని ప్ల కార్డులను ప్రదర్శించారు. తమకు తగిన న్యాయం జరిగేంత వరకు విధుల్లోకి వెళ్లబోమని భీష్మించుకూర్చున్నారు. ఆందోళన వద్దు.. భద్రత కల్పిస్తాం కోవిడ్–19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ భద్రత కల్పిస్తాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులతోపాటు సిబ్బందికి, కార్మికులకూ కోవిడ్ పరీక్షలు, చికిత్స అందిస్తాం. కార్మికుల సహా అందరికీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, అవసరమైన వారికి పీపీఈ కిట్లను అందజేస్తాం. హైపోక్లోరైడ్ స్ప్రే చేయిస్తున్నాం. శానిటైజ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.– డాక్టర్.కె.మనోహర్, డైరెక్టర్, నిమ్స్ -
మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్యుల ధూంధాం
-
మార్చురీలోని మృతదేహం ఎత్తుకెళ్లి..
కొత్తగూడెంరూరల్,జూలురూపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గల జిల్లా ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మార్చురీలో ఉన్న బాలుడి మృతదేహాన్ని వారి బంధువులు ఎవరికీ చెప్పకుండా తీసుకవెళ్లిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. జూలూరుపాడు మండలం బొజ్యాతండాకు చెందిన గుగులోతు రాందాస్ కుమారుడు శివ(13) తన సోదరుడితో గురువారం గొడవపడ్డాడు. శివను అన్న మందలించటంతో మనస్తాపానికి గురైన శివ ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు జూలురుపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకువెళ్లగా పరిస్థితి మిషమించటంతో జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు. ఇక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం శివ మృతిచెందాడు. వెంటనే శివ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు.. జిల్లా ఆసుపత్రిలో ఉన్న శివ మృతదేహానికి పోస్టుమార్టం కాకుండానే మృతుడి బంధువులు గురువారం రాత్రి ఇంటికి తీసుకెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం శివ మృతదేహం మార్చురీలో లేకపోవడంతో అధికారులు హైరానా పడ్డారు. పోస్టుమార్టం నిర్వహించాల్సిన మృతదేహం మాయం కావడంతో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దీంతో ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ సురేందర్ ఈ విషయమై త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో మృతుడికి సంబంధించిన బంధువులెవరూ కన్పించకపోవడంతో వారిని విచారించగా గురువారం రాత్రి వారే మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసినట్లు తెలిసింది. అయితే రాత్రి వేళలో విధులు నిర్వహించే నర్సుల వద్ద మార్చురీ తాళాలు ఉండాల్సి ఉండగా, అవి అటెండర్ వద్దకు ఎలా వచ్చాయని, అటెండర్ సైతం ఎలా మృతదేహాన్ని బయటకు పంపించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహం వెలికి తీయించి పోస్టుమార్టం.. జూలూరుపాడు మండలం బొజ్యాతండాలో సమీపంలో శివ మృతదేహాన్ని శుక్రవారం ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్ పర్యవేక్షణలో మృతదేహాన్ని బయటకు తీయించి, ఆర్ఎంఓ డాక్టర్ రవిబాబు నాయక్‌తో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ విషయమై డీసీహెచ్ గడ్డమీది రమేష్‌ను వివరణకోరగా మృతదేహం మాయంపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. -
స్టెతస్కోప్ పక్కనపెట్టి.. సన్మానం పేరుతో ఆటాపాట
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో వైద్యాధికారులు స్టెతస్కోప్ పక్కనపెట్టి ఆటపాటల్లో మునిగి తేలారు. సిబ్బంది స్టెప్పులేస్తుంటే మైమరిచిపోయి.. రోగులను గాలికొది లేశారు. గురువారం ఉదయం 11గంటలనుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ ఆస్పత్రి సిబ్బంది సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ హంగామా చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్‌కు సన్మానం పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మానం పక్కనబెడితే ఆస్పత్రిలోని నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు, ఆసుపత్రి వైద్య అధికారులు, ఆస్పత్రి సిబ్బంది, కార్మికులు ఇలా అంతా కొన్ని గంటలపాటు నృత్యాలు చేస్తూ ఆనందించారు. రోగులను గాలికి వదిలేశారు. వేలాది మంది రోగులు వైద్యం కోసం వేచి చూస్తున్న సమయంలో ఇలా విధులను వదిలిపెట్టి చిందులేయడంపై రోగులు, వారి బంధువులు మండిపడ్డారు. నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సు, క్వాలిటీ కంట్రోలర్, ఫార్మాసిస్ట్ ఇలా చాలామంది సినీ పాటలకు స్టెప్పులు వేస్తూ గోలగోల చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ వీరిని వారించకుండా చోద్యం చూశారని, గంటల తరబడి విధులకు డుమ్మా కొట్టి హంగామా చేయాల్సిన పనేంటని రోగులు ప్రశ్నించారు. రోగులను పట్టించుకునేందుకు ఖాళీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మొదట కుమారుడన్నారు..తర్వాత ఆడబిడ్డ అన్నారు
సాక్షి,బెంగళూరు (కలబుర్గి): ఓబాలింతకు బాలుడు జన్మించినట్లు చెప్పిన వైద్యులు తర్వాత మాట మార్చారు. పుట్టింది బాలుడు కాదు..ఆడబిడ్డ అని చెప్పారు. దీంతో బాలింత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈఘటన కలబుర్గీ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కలబుర్గీ జిల్లా జీవర్గీ తాలూకా కోణశిరసగి గ్రామానికి చెందిన నందమ్మ పురిటినొప్పులతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక జిల్లా ఆసుపత్రిలో చేరింది. కొద్ది సమయం తర్వాత ఆమె ఓ పండంటి బాబుకు జన్మించినట్లు వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. అటుపై అరగంట తర్వాత వచ్చి.. మీకు అబ్బాయి కాదు అమ్మాయి పుట్టిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న మిగిలిన వారు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి డీఎన్ఏ పరీక్షలకు ఒప్పించడంతో పరిస్థితి సద్దుమునిగింది. -
ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం
-
ఆస్పత్రి సిబ్బందికి నైపుణ్య కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లోని పలు రకాల సేవలకుగాను సిబ్బందికి నైపుణ్య కోర్సులను నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. వైద్యులుగా, నర్సులుగా, టెక్నీషియన్లుగా పనిచేయాలంటే తప్పనిసరిగా ఆయా కోర్సులు చదవాలి. వైద్య, ఆరోగ్యశాఖలోని సంబంధిత విభాగాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ వీరి కంటే రెట్టింపు స్థాయిలో కింది స్థాయి సిబ్బంది పనిచేస్తుంటారు. ఆపరేషన్ థియేటర్ బాయ్‌లుగా, రోగులను వీల్‌చైర్‌పై తరలించే వర్కర్లుగా, వార్డుల్లో రోగులకు సహాయకులుగా, మరుగుదొడ్లు క్లీనర్లుగా రకరకాల పనిచేసే వారెవరికీ కోర్సులు, శిక్షణ, రిజిస్ట్రేషన్ ఉండటం లేదు. వారి ప్రవర్తన ఒక్కోసారి రోగులకు అశనిపాతంగా మారుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆస్పత్రుల్లోని ఇటువంటి సిబ్బందికి, ఏడో తరగతి పాసైన నిరుద్యోగులక ు6 నెలల ఆస్పత్రి నిర్వహణపై శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. కొన్ని కోర్సులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మరికొన్నింటికి పారామెడికల్ అనుమతితో ప్రైవేటు సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. శిక్షణ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే ఆస్ప త్రుల్లో ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కూడా దీనిని తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు వెయ్యి చొప్పున ఉంటాయి. వాటిల్లోని కిందిస్థాయి సిబ్బంది ఎవరూ నిర్ణీత కోర్సుతో శిక్షణ పొంద లేదు. ఆస్పత్రుల్లోని పనులు, అక్కడి వ్యవహారాలపై సిలబస్ తయారు చేసి ఆరు నెలలపాటు శిక్షణ కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తే రాష్ట్రం నుంచి లక్ష మందికి దేశ విదేశాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆస్పత్రి రంగంపై శిక్షణ పొందినవారికి దేశ, విదేశాల్లో డిమాండ్ బాగానే ఉంది. కాస్త ఇంగ్గిష్ మాట్లాడగలిగితే దుబాయ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ఉపాధి అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాత పారామెడికల్ విభాగం ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. -
పద్ధతి మారకపోతే చర్యలు : డీఎంహెచ్ఓ
అమ్రాబాద్ : వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది విధులపై అనుసరిస్తున్న పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ హెచ్చరించారు. అమ్రాబాద్ ప్రభుత్వాస్పత్రిని మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది, రోగుల హాజరు రికార్డులను పరిశీలించారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు, పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణ శుభ్రంగా ఉంచాలని, రోగులకు నిత్య వైద్య సేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలని ఆదేవించారు. ఇదే పద్ధతి కొనసాగితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట అచ్చంపేట డిప్యూటీ మలేరియాధికారి అశోక్‌ప్రసాద్ ఉన్నారు. -
చనిపోయిందంటూ చెత్తబుట్టలో పడేశారు!
వైరా: ఖమ్మం జిల్లా వైరాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది అప్పుడే పుట్టిన పసికందును చనిపోయిందంటూ చెత్తబుట్టలో పడేసింది. అయితే విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పసికందు కదలికలను గుర్తించి షాక్ తిన్నారు. వెంటనే షాక్ నుంచి తేరుకుని శిశువుకు మెరుగైన చికిత్స అందించడానికి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మరికొందరు కుటుంబసభ్యులు వైరాలోని ప్రైవేట్ ఆస్ప్రతి సిబ్బంది నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి శంకర్పల్లి: ‘ఆస్పత్రులకు వచ్చే రోగుల చికిత్సకోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చేస్తోంది. రోగులకు వైద్యం అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. నీవు విధులకు హాజరు కావు.. నీవు ఉండి ఎందుకు దండగ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను ఆస్పత్రికి వచ్చాను.. విధుల్లో లేవు.. మరో రెండుసార్లు కూడా ఆస్పత్రికి వచ్చినా కనిపించలేదు. ఇలాగైతే ఈ ఆస్పత్రి ఎందుకు.. మీరు ఎందుకు..’ అని శంకర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు నాగనిర్మలపై ఎమ్మెల్యే కాలె యాదయ్య తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ నర్సింలు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమానంగా అమలు చేస్తుందన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
అమ్మా.. నేను క్షేమం!
కర్నూలు(హాస్పిటల్): నవజాత శిశువు ఆదివారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల వార్డులో కనిపించింది. మధ్యాహ్నం వేళ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వార్డులోని పీఐసీయు వద్ద నేలపై శిశువును పడుకోబెట్టి వెళ్లిపోయారు. పది రోజులు వయస్సుండే ఈ ఆడశిశువు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నట్లు బక్కచిక్కి కనిపిస్తోంది. తల్లి కోసమే, అనారోగ్యం బాధ తట్టుకోలేకో తెలియదు కానీ గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. ఆసుపత్రి సిబ్బంది ఆ చిన్నారిని వార్డులో చేర్చుకుని చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ రవికుమార్ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కోఠిలో గర్భిణుల బైఠాయింపు
హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓపీని గురువారం సిబ్బంది ఆలస్యంగా తెరవడం రోగులను గందరగోళపరి చింది. ఆసుపత్రిని వేరే చోటుకు తరలించేందుకే ఓపీని తెరవలేదని భావించిన గర్భిణులు తమ బంధువులతో కలసి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో గర్భిణులు వైద్య పరీక్షల నిమిత్తం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన ఓపీ ఎంతకీ తెరవకపోవడంతో చికిత్సకు వచ్చినవారు కలవరపడ్డారు. అక్కడి నుంచి ప్రసూతి ఆసుపత్రిని తరలించారని ఇక వైద్యసేవలు అందవని కొందరు చెప్పడంతో వందలాది మంది రోగులు ఆగ్రహంతో కోఠి ఉమెన్స్ కళాశాల రోడ్డుపై బైఠాయించారు. దీంతో కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా నుండి ఇసామియాబజార్, చాదర్‌ఘాట్, ఇటువైపు సుల్తాన్‌బజార్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌చౌరస్తా, బ్యాంక్‌స్ట్రీట్, ఉస్మానియా మెడికల్ కళాశాల రోడ్డు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుల్తాన్‌బజార్ పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పారు. ఆసుపత్రి వర్గాలు కూడా అప్రమత్తమై ఓపీని తొమ్మిది గంటలకు తెరవడంతో పరిస్థితి సద్దుమణిగింది. రోగులు, ఆసుపత్రి సిబ్బంది మధ్య సమాచారం కొరవడడం వల్లే గందరగోళానికి దారితీసినట్లు తెలుస్తోంది. -
న్యాయం చేయాలని వినతి
ఎమ్మెల్యే చెవిరెడ్డిని కోరిన ఏరియా ఆస్పత్రి సిబ్బంది తిరుపతి రూరల్ : ‘ఆస్పత్రిలో ఏళ్లతరబడి పనిచేస్తున్నాం.. ఇప్పుడు ఉద్యోగులను తీసేసి ఆస్పత్రిని స్వాధీనం చేసుకోవాలని మెడికల్ కళాశాల అధికారులు ప్రయత్నిస్తున్నారు. మేమంతా రోడ్డున పడతాం.. మీరైనా న్యాయం చేయండి’ అంటూ చంద్రగిరి ఏరియా ఆస్పత్రి సిబ్బంది వేడుకున్నారు. శనివారం తుమ్మలగుంటలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ 50మందికిపైగా సిబ్బందిని తొలగించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవనాలతోపాటు సిబ్బంది కూడా ఉండేవిధంగా చూడాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ వైద్యవిధాన పరిషత్ కనకదుర్గం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉద్యోగులకు న్యాయం చేయకుంటే కళాశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి హేమేంద్ర కుమార్‌రెడ్డి, హాస్పిటల్ కమిటీ సభ్యులు యుగంధర్‌రెడ్డి, మిట్టపాళెం ఎంపీటీసీ నాగరాజు, ఆనంద్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రోగులంటే అంత చులకనా?
నేలపై చిందరవందరగా ఖరీదైన మందులు స్టోర్ రూమ్‌లో కొత్త దిండ్లు, పరుపులు చిరిగిన దిండ్లు, పరుపులపై రోగుల అవస్థలు కోడ్ పాటించకుండా విధులకు హాజరైన వైద్యుడు మండిపడ్డ కో-ఆర్డినేటర్ డాక్టర్ నాయక్ రోగుల కోసం పంపిన పరుపులు స్టోర్ రూమ్‌లో మూలుగుతున్నాయి. రోగుల మంచాలపై చిరిగిపోయిన దిండ్లు, పరుపులు దర్శనమిస్తున్నాయి. ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చిందరవందరగా నేలపై పడిఉన్నాయి. స్టాకు రిజిస్టర్లో మందుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి. నక్కపల్లి ముప్ఫయ్ పడకల ఆస్పత్రి సిబ్బంది పనితీరిది. వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ సోమవారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన నిర్లక్ష్యమిది. నక్కపల్లి, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నక్కపల్లి 30 పడకల ఆస్పత్రి సిబ్బందిపై వైద్యవిధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల జీవితాలతో ఆటలాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆయన సోమవారం నక్కపల్లి 30 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందులను భద్రపరిచే గదిని పరిశీలించి అక్కడ రోగులకు వాడే అత్యంత ఖరీదైన మందులు చెల్లా చెదురుగా పడి ఉండటంపై ఫార్మసిస్టు, ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న స్టోర్ రూం సీడీసీ నుంచి తీసుకొచ్చిన మందులకు రిజిస్టర్‌ను నిర్వహించకపోవడం, రోగుల కోసం ప్రభుత్వం సరఫరాచేసిన బెడ్లను స్టోర్‌రూంలో భద్రపరచడాన్ని కూడా తప్పుపట్టారు. రోగులు చిరిగిపోయిన బెడ్లపై, దిండ్లు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సరఫరా చేసిన పరుపులు, దిండ్లను స్టోర్‌రూంలో భద్రపరచడం సరికాదన్నారు. డాక్టర్ల గదుల్లో కొత్త పరుపులు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా ఉందని, వైద్యాధికారుల పర్యవే క్షణ కొరవడిందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఖరీదైన మందులను భద్రపరచాల్సిన స్టోర్‌రూం డంపింగ్ యార్డు ను తలపిస్తోందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన పరుపులను తక్షణమే వార్డుల్లోని మంచాలపై వేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో మూలుగుతున్న రూ.లక్షల నిధులతో రోగులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఎన్ బీఎస్ యూనిట్‌ను సందర్శించారు. పుట్టిన శిశువు పచ్చకామెర్లు, ఉబ్బసం, ఊపిరాడక, ఉష్ణోగ్రత సరిపోక ఇబ్బందిపడితే కాపాడేందుకు ప్రభుత్వం ఈ ఆస్పత్రిలో నూబోర్న్స్స్టెబిలైజేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అసలు ఇక్కడ ఆ సౌకర్యం ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఈ సౌకర్యం ఉన్నట్లు అందరికి తెలియజేయాలని అక్కడి ఏఎన్ఎంకు సూచించారు. ఒక వైద్యుడు టీ షర్ట్, జీన్ ప్యాంట్ ధరించి విధులకు హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ దుస్తుల్లో మిమ్మల్ని రోగులు చూస్తే వైద్యుడని భావిస్తారా?, డ్రస్ కోడ్ పాటించి హుందాగా డ్యూటీ చేయండని’ డాక్టర్ నాయక్ హితవు పలికారు. డ్రస్ కోడ్ పాటించని సిబ్బందిని విధులకు హాజరుకానీయొద్దని వైద్యాధికారి పూర్ణచంద్రరావును ఆదేశించారు. సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రేపటినుంచి విధులకు రాకు యాంటీ బయాటిక్ ఇంజక్షన్లు, మందులను గదిలో ఎక్కడిపడితే అక్కడ చిందరవందరగా పడేసిన ఫార్మసిస్టుపై డాక్టర్ నాయక్ మండిపడ్డారు. ‘నువ్వు ఎంతోమందితో రికమండేషన్లు చేయిస్తే తప్పని పరిస్థితుల్లో నీకు ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది. ఇలా బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తావా? రేపటి నుంచి డ్యూటీకి రాకు. అవసరానికి మించి స్టాకు తీసుకొచ్చి ఇష్టానుసారం పడేసావు. ఎక్కడైనా మందుల కొరత ఏర్పడితే నేనేం చేయాలి? ఏమని సమాధానం చెప్పాలి?’ అని నిలదీశారు. తీసుకొచ్చిన మందుల వివరాలను రికార్డుల్లో రాయకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. పాము, కుక్కకాటు ఇంజక్షన్లకు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కొరత ఉంది. ఈ ఆస్పత్రిలో మాత్రం అవసరానికి, డిమాండ్‌కు మించి స్టాకు ఉన్నాయి. ఇంత ఎక్కువ మొత్తంలో స్టాకు తీసుకువచ్చి సక్రమంగా భద్రపరచ కపోవడంపై డాక్టర్ నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
తప్పెవరిదమ్మా...!
బిజినేపల్లి, న్యూస్‌లైన్: అమ్మా...నేను పుట్టి ఇరవై రోజులే అయ్యింది. తనివితీరా నీ పొ త్తిళ్లలో బజ్జున్న దాఖలాలూ లేవు. ప్రేమతో నీవిచ్చే స్తన్యాన్ని ఆకలితో జుర్రుకుందీ లేదు. అప్పుడే నేనంటే నీకు విరక్తా...లేకుంటే ఆడబిడ్డనని భారమయ్యానా..? నా బదులు ఓ బాబు నీ కడుపున పుట్టి ఉంటే ఇలా వదిలించుకోవాలనుకునే దానివా..? నువ్వు సమాధానం చెప్పలేవు. బదులిచ్చే జవాబులు లేవు. ఇదీ ఓ పసికందు హృదయస్పందనలు. తనకు తెలీకుండానే అమ్మకానికి పెట్టిన తల్లిని నిలదీస్తూ వినిపించిన ఘోష. స్థానికులను కదిలించిన ఈ సంఘటన ఇలా... శనివారం మధ్యాహ్నం..అంతా ఎవరి పనుల్లో వారున్నారు. ఇక్కడ వారికి పెద్ద దిక్కుగా ఉన్న దవఖానా ముందు ఓ కారు సరిగ్గా 3.30 గంటల సమయంలో ఆగింది. అందులోనుంచి దిగిన ఒకామెకు ఆసుపత్రి సిబ్బంది ఎదురొచ్చి కాసేపు ఆగమని చెప్పారు. వారి రాక కోసమే నిరీక్షిస్తున్న ఓ తల్లి తన 20 రోజుల బిడ్డతో సహా అక్కడికి వచ్చింది. వారితో బిడ్డ అమ్మమ్మ కూడా వచ్చింది. ముందనుకున్న ఒప్పందం మేరకు ఆ బిడ్డ అమ్మకానికి బేరం కుదిరింది. ఆమెను కన్నతల్లి పేరు రజియా బేగం. భర్తతో విభేదాల కారణంగా అతను లేడు. ఆమె ఇదే ఆసుపత్రిలో ఆ చిన్నారిని ప్రసవించింది. అప్పుడే తాను పేద కూలీనని బిడ్డను పెంచే స్థోమత లేదని ఆసుపత్రి సిబ్బందికి చెప్పుకుంది. ఆమె కథను విన్న ఓ ఎన్ఎం ఆ శిశువును పిల్లలు లేని వారికి అప్పగిస్తే బాగుంటుందని చెప్పి ఆ అన్వేషణలో పడింది. ఇంతలో ఎలా తెలుసుకుందో అచ్చెంపేటకు చెందిన మహిళ ( ఆమె మాత్రం తనది హైదరాబాదని చెప్తోంది) ఆ చిన్నారిని కొనేందుకు ముందుకు రావడంతో పీహెచ్సీ ముందే ఈ తతంతగం శనివారం బాహాటంగానే సాగింది. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడికి సమీపంలోనే ఉండి గమనిస్తున్న స్థానిక మహిళలు మణెమ్మ, బౌరమ్మ, పార్వతమ్మలు కార్లో చంటిపాపను తీసుకెళ్తుండగా వెంటనే స్పందించి అడ్డుకున్నారు. విషయాన్ని కాస్తా ఫోన్‌ద్వారా పోలీసులకు తెలియచేశారు. దీంతో ప్రొబిషనరీ డీఎస్పీ బాషా చంటిపాపతో సహా రజియాను, ఆమె తల్లిని ,కొనుగోలుకు వచ్చిన మహిళను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. వారిని గట్టిగా హెచ్చరించారు. ఆర్థిక స్తోమత లేని కారణంగానే అమ్మకానికి తెగించినట్లు రజియా చెప్పడంతో బిడ్డను ఐసీడీఎస్ ద్వారా సోమవారం శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పోలీసులు చేశారు. ఈ సందర్భంగా వెళ్లిన విలేకరులపైనా ‘ మా బిడ్డను మేం అమ్ముకుంటే మీకేం’ అని విరుచుకు పడడం విశేషం. మొత్తానికి ఇలా లోకం పోకడే తెలియని ఆ పసికందు అందరూ ఉండి అమ్మ ఒడినుంచి అనాథల ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తల్లికి పోషణ భారాన్ని దించేసినా మారుతున్న ధోరణులు అద్దంపడుతోంది. అనేక ప్రశ్నలు మౌనంగానే సంధిస్తోంది. -
సీఎం రికమండేషన్ ఉందా?
కొత్తపేట, న్యూస్‌లైన్ : ప్రతి మనిషీ ఓ తల్లి ప్రసవవేదన అనంతరం కన్ను తెరిచిన వాడే. అయితే కళ్లు నెత్తికెక్కిన ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆ మాటే మరిచారు. పురిటి నొప్పులతో వచ్చిన ఓ నిండు గర్భిణిని తమ వెటకారపు మాటలతో అంత కన్నా నొప్పించారు. ‘సీఎం రికమండేషన్ ఉందా, ఎమ్మెల్యే రికమండేషన్ ఉందా’ అంటూ ఆమెను పరిహసించారు. పోనీ, సూటీపోటీ మాటలంటే అన్నారు, అసలు ఆ నిండు చూలాలిని ఆస్పత్రిలో చేర్చుకున్నారా అంటే అదీ లేదు. దాంతో ఆమె ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం బాధితురాలి చెల్లెలు జనిపిరెడ్డి నాగలక్ష్మి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన నాగా సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమార్తె యర్రంశెట్టి సత్య అత్తవారి ఊరైన కేదారిలంక నుంచి రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఆమెకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె చెల్లెలు జనిపిరెడ్డి నాగలక్ష్మి సాయంతో కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఇద్దరు నర్సులు ఉన్నారు. వీరిలో ఓ నర్సు ‘ఇప్పుడు డాక్టరు ఉండరు, ఉదయం తీసుకురండి’ అని చెప్పింది. పురిటినొప్పులు వస్తున్నాయని, వెంటనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని నాగలక్ష్మి ప్రాధేయపడింది. దాంతో ‘సీఎం రికమండేషన్ ఉందా, ఎమ్మెల్యే రికమండేషన్ ఉందా’ అంటూ ఆ నర్సు హేళనగా మాట్లాడారు. త మకు తెలిసిన నాయకులతో ఫోన్ చేయిస్తామని నాగలక్ష్మి చెప్పింది. విషయం తెలుసుకున్న డ్యూటీ డాక్టర్ వచ్చి గర్భిణిని పరీక్షించాడు. బిడ్డ అడ్డం తిరిగిందని, రాజమండ్రి తీసుకువెళితే ఆపరేషన్ చేస్తారని చెప్పారు. అంతే కాక గర్భిణితో పాటు తోడుగా ఉన్నవారికి కూడా భోజనం పెడతారని హేళనగా మాట్లాడారు. పేద కుటుంబానికి చెందిన వాళ్లను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించుకోవాల్సిందిపోయి, ఎగతాళిగా మాట్లాడారని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసిం ది. గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఆపరేషన్ చేసి బిడ్డను తీశారని పేర్కొంది. ఈ సంఘటనపై విచారణ జరిపి, కొత్తపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.