
ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆ నర్సు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా..
Hospital staff member attacking the woman: బీహార్‌లోని జాముయి జిల్లాలోని గ్రాస్‌రూట్‌లో ఒక మహిళా నర్సు ఒకరోజు విధులకు హాజరుకానందుకు సదరు ఆసుపత్రి సిబ్బంది మందలించారు. అంతేకాదు విధులకు హాజరు కానట్లయితే తొలగిస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఇంతలో ఒక వ్యక్తి సదరు నర్సు పై అరవడం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి నర్సుపై దాడికి దిగాడు.
(చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!)
దీంతో పక్కనే ఉన్న సహోద్యోగులు జోక్యం చేసుకోవడంతో గోడవ కాస్త సద్దుమణిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆస్పత్రి సిబ్బంది ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో సదరు వ్యక్తి గొడవ పెద్దదవుతుందంటూ అధికారికి తెలియజేశాడు. ఇక ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆ నర్సు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఆరోగ్య సిబ్బంది పాత్ర పాత్ర చాలా కీలకం.
(చదవండి: ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్)
वैक्सिनेशन के काम में लगे एक एएनएम के साथ जमुई ज़िले के चकाई रेफ़रल अस्पताल के वरीय स्टाफ़ कैसे मारपीट कर रहे हैं देखिए इसका एक विडीओ @ndtvindia @Anurag_Dwary @Suparna_Singh pic.twitter.com/HMPnQmJU9X
— manish (@manishndtv) January 7, 2022