చనిపోయిందంటూ చెత్తబుట్టలో పడేశారు! | new born child thrown in dust bin | Sakshi
Sakshi News home page

చనిపోయిందంటూ చెత్తబుట్టలో పడేశారు!

Published Tue, Nov 15 2016 11:32 AM | Last Updated on Wed, Oct 17 2018 3:53 PM

new born child thrown in dust bin

వైరా: ఖమ్మం జిల్లా వైరాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది అప్పుడే పుట్టిన పసికందును చనిపోయిందంటూ చెత్తబుట్టలో పడేసింది. అయితే విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పసికందు కదలికలను గుర్తించి షాక్ తిన్నారు.

వెంటనే షాక్ నుంచి తేరుకుని శిశువుకు మెరుగైన చికిత్స అందించడానికి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మరికొందరు కుటుంబసభ్యులు వైరాలోని ప్రైవేట్ ఆస్ప్రతి సిబ్బంది నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement