పద్ధతి మారకపోతే చర్యలు : డీఎంహెచ్‌ఓ | sundar lala sudden inspection | Sakshi
Sakshi News home page

పద్ధతి మారకపోతే చర్యలు : డీఎంహెచ్‌ఓ

Published Fri, Jan 6 2017 3:50 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

పద్ధతి మారకపోతే చర్యలు : డీఎంహెచ్‌ఓ

పద్ధతి మారకపోతే చర్యలు : డీఎంహెచ్‌ఓ

అమ్రాబాద్‌ : వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది విధులపై అనుసరిస్తున్న పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్‌ హెచ్చరించారు. అమ్రాబాద్‌ ప్రభుత్వాస్పత్రిని మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది, రోగుల హాజరు రికార్డులను పరిశీలించారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు, పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణ శుభ్రంగా ఉంచాలని, రోగులకు నిత్య వైద్య సేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలని ఆదేవించారు. ఇదే పద్ధతి కొనసాగితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట అచ్చంపేట డిప్యూటీ మలేరియాధికారి అశోక్‌ప్రసాద్‌ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement