Ashok Prasad
-
‘అతడు ఉగ్రవాదే.. అమెరికా సరిగ్గా పేరు పెట్టింది’
న్యూఢిల్లీ: హిబ్జుల్ ముజాహిదీన్ సంస్థ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ముమ్మాటికీ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. అతడు ఇటీవల మాట్లాడిన తీరే అతడు ఉగ్రవాది అని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. అమెరికా అతడికి ప్రపంచ ఉగ్రవాది అని పేరు పెట్టిందని, దానికి అతడు తగినవాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. భారత్లోపల ఎక్కడంటే అక్కడ తాము దాడులు చేయగలం అని సలావుద్దీన్ ఈ నెల 1న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి అశోక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సయ్యద్ భారత్కు వ్యతిరేకంగా చేసిన మాటలే అతడు ఉగ్రవాది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ‘అతడు అంతర్జాతీయ ఉగ్రవాది అని అమెరికా అతడికి తగిన పేరే పెట్టింది’ అని అన్నారు. -
పద్ధతి మారకపోతే చర్యలు : డీఎంహెచ్ఓ
అమ్రాబాద్ : వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది విధులపై అనుసరిస్తున్న పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ హెచ్చరించారు. అమ్రాబాద్ ప్రభుత్వాస్పత్రిని మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది, రోగుల హాజరు రికార్డులను పరిశీలించారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు, పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణ శుభ్రంగా ఉంచాలని, రోగులకు నిత్య వైద్య సేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలని ఆదేవించారు. ఇదే పద్ధతి కొనసాగితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట అచ్చంపేట డిప్యూటీ మలేరియాధికారి అశోక్ప్రసాద్ ఉన్నారు.