
‘అతడు ఉగ్రవాదే.. అమెరికా సరిగ్గా పేరు పెట్టింది’
హిబ్జుల్ ముజాహిదీన్ సంస్థ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ముమ్మాటికీ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. అతడు ఇటీవల మాట్లాడిన తీరే అతడు ఉగ్రవాది అని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది.
భారత్‌లోపల ఎక్కడంటే అక్కడ తాము దాడులు చేయగలం అని సలావుద్దీన్ ఈ నెల 1న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి అశోక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సయ్యద్ భారత్‌కు వ్యతిరేకంగా చేసిన మాటలే అతడు ఉగ్రవాది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ‘అతడు అంతర్జాతీయ ఉగ్రవాది అని అమెరికా అతడికి తగిన పేరే పెట్టింది’ అని అన్నారు.