ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి
శంకర్‌పల్లి: ‘ఆస్పత్రులకు వచ్చే రోగుల చికిత్సకోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చేస్తోంది. రోగులకు వైద్యం అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. నీవు విధులకు హాజరు కావు.. నీవు ఉండి ఎందుకు దండగ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను ఆస్పత్రికి వచ్చాను.. విధుల్లో లేవు.. మరో రెండుసార్లు కూడా ఆస్పత్రికి వచ్చినా కనిపించలేదు. ఇలాగైతే ఈ ఆస్పత్రి ఎందుకు.. మీరు ఎందుకు..’ అని శంకర్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు నాగనిర్మలపై ఎమ్మెల్యే కాలె యాదయ్య తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ నర్సింలు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమానంగా అమలు చేస్తుందన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
Published Sat, Jul 30 2016 6:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement