సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల అలజడే కాదు, పాములు కలకలం సృష్టిస్తున్నాయి. పేషెంట్లను వైద్య సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. పేషెంట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. పదిరోజుల క్రితం క్యాన్సర్ వార్డులోని బాత్రూంలోకి చొరబడ్డ నాగుపాము, తాజాగా వార్డులోకే వచ్చింది. ఓ పేషెంట్ బెడ్ కిందకి రావడంతో పామును చూసిన పేషెంట్లు వారి బంధువులు భయంతో పరుగులు తీశారు.
అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చి దాక్కున్న పామును పట్టేశారు. పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు పాము ఆసుపత్రిలో ప్రత్యక్షం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు ఆసుపత్రిలో పాములు కనిపించడం, గతంలో ఎలుకలు అలజడి సృష్టించడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. పురాతన భవనం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే పాములు ఎలుకలకు ఆవాసంగా ఆసుపత్రి మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది.
చదవండి: రెస్టారెంట్‌లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త
Comments
Please login to add a commentAdd a comment