మందుల వివరాలను నమోదు చేస్తున్న సిబ్బంది
సిద్దిపేటకమాన్: ‘ఈ–ఔషధి’ అమలులో సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆదర్శంగా నిలుస్తోంది. ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారికి అందించే మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండటంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 19వేల మంది రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
అత్యాధునిక సేవలు
సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కార్పొరేట్ హంగులతో అత్యాధునిక సేవలు అందిస్తోంది. ఆస్పత్రికి నిత్యం వచ్చే వందలాది మంది రోగులను వైద్యులు పరీక్షించడంతో పాటు ఫార్మసీలో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. అయితే, గతంలో రోగుల సంఖ్య, వారికి అందజేసే మందుల వివరాలను చేతిరాత ద్వారా రికార్డు చేసేవారు. ఈ పద్ధతి వల్ల రోగులు, మందుల వివరాలు సమాచారం పక్కాగా ఉండేది కాదు. దీంతో మందులు పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
ప్రస్తుతం ఆస్పత్రుల్లో వసతుల కల్పన, వైద్య సేవల మెరుగుదలపై రాష్ట్ర సర్కార ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రోగుల వివరాలను పక్కాగా నమోదు చేయడం, పారదర్శకంగా మందులను పంపిణీ చేయడానికి ఈ–ఔషది విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కంప్యూటర్లతో పాటు సిబ్బందికి శిక్షణ అందించారు. అంతేకాకుండా రోజువారి రోగులు, మందుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ విధానం 2017 మార్చి నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 19,112 మంది రోగుల వివరాలనుఈ–ఔషధిలో నమోదు చేయడం గమనార్హం. ఈ విధానంతో సిద్దిపేట జిల్లా ఆస్పత్రి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలుస్తోంది.
రోజుకు 1200 ఓపీ
సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి నిత్యం వివిధ విభా గాల్లో సుమారు 1200 మంది రోగులు సేవలు పొం దుతున్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు లేకపోవడంతో పాటు సేవలు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో 500 వరకు మంది ఔట్ పేషె ంట్లు వచ్చేవారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఇటీవల ఆస్పత్రిని అన్ని విధాల అ భివృద్ధి చేస్తున్నారు. అన్ని విభాగాల్లో వైద్యులను ని యమించడం, హైరిస్క్ కేంద్రం,డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో రోగుల సంఖ్య పెరుగుతోంది.
ఈ ప్రక్రియ కొనసాగుతుంది
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ–ఔషధి ద్వారా రోగులు, మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఎప్పటికీ కొనసాగుతుంది. గతంలో రికార్డులు రాసే విధానం ఉండటంతో మందులు పక్కదారి పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు.
– డా.నర్సింహం, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment