ఈ రిమోట్‌ ‘ఆపరేషన్‌’ అద్భుతం! | Gujarat: Robot-assisted heart surgery performed on patient from 32 kms away | Sakshi
Sakshi News home page

ఈ రిమోట్‌ ‘ఆపరేషన్‌’ అద్భుతం!

Published Fri, Dec 7 2018 2:14 AM | Last Updated on Fri, Dec 7 2018 2:14 AM

Gujarat: Robot-assisted heart surgery performed on patient from 32 kms away - Sakshi

వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్టు, గుజరాత్‌కు చెందిన డాక్టర్‌ తేజస్‌ పటేల్‌ అత్యాధునిక టెక్నాలజీతో గుండె ఆపరేషన్‌ చేసి చరిత్ర సృష్టించారు. 32 కి.మీ. దూరంలో ఉన్న ఒక మహిళా రోగి గుండెకు రోబోటిక్‌ టెక్నాలజీ వినియోగించి స్టెంట్‌ వేశారు. ఇలా రోగికి అంత దూరం నుంచి కూడా సర్జరీ చేయడం, దానికి రోబోటిక్‌ మొబైల్‌ టెక్నాలజీ వినియో గించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన సర్జరీకి గుజరాత్‌ గాంధీనగర్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అక్షర్‌ధామ్‌ వేదికైంది.  

సర్జరీ ఎలా చేశారంటే.. 
గుజరాత్‌కు చెందిన ఒక మహిళా రోగి గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అవరోధాల్ని తొలగించి, స్టెంట్‌ వేసే ఆపరేషన్‌ను డాక్టర్‌ తేజస్‌ పటేల్‌ తానున్న చోటు నుంచి కదలకుండానే చేశారు. అహ్మదాబాద్‌లో ఒక ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌కి ఆ రోగిని తీసుకువచ్చారు. ఆపరేషన్‌ థియేటర్‌లోని కాథ్‌ ల్యాబ్‌లో ఉన్న రోబో చెయ్యిని.. అక్షర్‌ధామ్‌లో డాక్టర్‌ వద్ద ఉన్న కంప్యూటర్‌తో అనుసంధానం చేశారు. ఎదురుగా ఒక స్క్రీన్‌పై రోబో చెయ్యి, మరో స్క్రీన్‌పై పేషెంట్, ఇంకో స్క్రీన్‌ మీద రోగి బ్లడ్‌ ప్రెషర్, హార్ట్‌ బీట్‌ వంటి వివరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్నెట్‌ ద్వారా రోబో చెయ్యిని ఆపరేట్‌ చేస్తూ ఆ రోగి గుండెకి విజయవంతంగా స్టెంట్‌ వేశారు. ఈ టెక్నాలజీని టెలీ రోబోటిక్స్‌ అని పిలుస్తారు. టెలిమెడిసన్, రోబోటిక్స్‌ టెక్నాలజీని కలగలిపి వినియోగించడం వల్ల నిపుణులైన డాక్టర్లు మారుమూల గ్రామాలకు వెళ్లకుండానే ఇలాంటి సర్జరీలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సర్జరీని చూడడానికి అక్షరధామ్‌కు వచ్చిన  గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స గుజరాత్‌కు గర్వకారణమని వ్యాఖ్యానించారు. డాక్టర్‌ తేజస్‌ వంటి అనుభవజ్ఞుల సేవల్ని ఈ టెక్నాలజీ ద్వారా మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు చేపడతామని చెప్పారు.  

భవిష్యత్‌ టెలి రోబోటిక్స్‌దే.. 
అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలకు రోబోటిక్‌ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆపరేషన్‌ను 100 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను వినియోగించి నిర్వహించారు. ఇక 5జీ టెలికామ్‌ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే  ఈ తరహా ఆపరేషన్లు ఎక్కువగా జరిగే అవకాశముంది. సాధారణంగా గుండెలో స్టెంట్‌ వేయడానికి అయ్యే ఖర్చు కంటే, ఇలా టెలీ రోబోటిక్స్‌ విధానం ద్వారా చేసే ఆపరేషన్‌కు ప్రస్తుతానికైతే 40 నుంచి 50 వేలు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తే ఖర్చు తగ్గే అవకాశముంది. ‘ఇవాళ ఆపరేషన్‌ 32 కి.మీ. దూరం నుంచి చేశాం. భవిష్యత్‌లో ఇదే టెక్నాలజీ వినియోగించుకొని దేశంలో ఏ మారుమూల ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా చేయొచ్చు’ అని  డాక్టర్‌ తేజస్‌ పటేల్‌ అన్నారు. క్యాథ్‌ ల్యాబ్, రోబో చెయ్యి, నిరంతరాయంగా ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంటే ఇలాంటి ఆపరేషన్‌లు ఎక్కడ నుంచి అయినా చేయొచ్చని, యువ సర్జన్లకి ఇందులో శిక్షణ ఇస్తానని తెలిపారు. డాక్టర్‌ తేజస్‌ పటేల్‌ ఇప్పటికే 300కి పైగా రోబోటిక్‌ సర్జరీలు నిర్వహించారు. అయితే, ఇలా కిలోమీటర్ల దూరంగా ఉన్న పేషెంట్‌కు సర్జరీ చేయడం లైవ్‌ ఆపరేషన్‌ చేయడం ఇదే ప్రథమం. ఈ ఆపరేషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాకు చెందిన కొరిండస్‌ వాస్క్యు లర్‌ రోబోటిక్స్‌ కంపెనీ అందించింది. నిపుణులైన డాక్టర్లు ఎక్కడ ఉన్నప్పటికీ వారి సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా అందుబాటులోకి రావడం ఈ టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆ కంపెనీ సీఈవో మార్క్‌ టోలండ్‌



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement