Nurse in love with patient made physical relationship; heart attack got into trouble - Sakshi
Sakshi News home page

చికిత్స కోసం వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్‌.. ఆసుపత్రి బయట కూడా! ఆమెకు ఊహించని షాక్‌

Published Wed, Jul 5 2023 8:24 AM | Last Updated on Wed, Jul 5 2023 9:12 AM

Nurse in Love with Patient made Physical Relationship Heart Attack - Sakshi

ఆ విషయం తెలియగానే ఆసుపత్రి యాజమాన్యంలో కలకలం చెలరేగింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేయడంతో, యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దర్యాప్తులో ఆమె ఆ బాధితుడు డయాలసిస్‌ కోసం వస్తుంటాడని చెప్పింది.

ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా..
చికిత్స కోసం వచ్చిన బాధితునితో ఒక నర్సు రిలేషన్‌షిప్‌ పెట్టుకుంది. ఆసుపత్రి బయట కూడా ఆ బాధితుడిని కలుస్తూ వచ్చింది. ఈ వ్యవహారం ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా గుట్టుగా సాగింది. అయితే ఒక రోజు ఆ బాధితుడు చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా కన్నుమూశాడు. అతనికి హార్ట్‌ ఎటాక్‌  వచ్చింది. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేశారు. 

సోషల్‌ మీడియా సాయంతో..
డెయిలీ స్టార్‌ రిపోర్టులోని కథనం ప్రకారం ఈ ఉదంతం ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. పెనెలోప్‌ విలియం అనే మహిళ 2019 నుంచి నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో నర్సుగా పనిచేస్తోంది.ఈ నేపధ్యంలో ఆమెకు ఒక పేషెంట్‌తో సంబంధం ఏర్పడింది. వారు రహస్యంగా కాల్‌ చేసుకోవడం, కలుసుకోవడం చేస్తూ వచ్చారు. సోషల్‌ మీడియా సాయంతో ఇద్దరూ చాటింగ్‌ చేసుకునేవారు. ఆసుపత్రి బయట తరచూ కలుసుకునేవారు. అయితే ఒక రోజు అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారులో వారిద్దరూ రహస్యంగా కలుసుకున్న సమయంలో ఆ పేషెంట్‌కు గుండెపోటు వచ్చింది.

సహోద్యోగికి ఫోను చేసి..
వెంటనే పెనెలోప్‌ అంబులెన్స్‌కు కాల్‌ చేసింది. ఇంతలో వారుంటున్న కారులోనే ఆ బాధితుడు మృతి చెందాడు. అయితే పెనెలోప్‌ తన సహోద్యోగినికి ఫోను చేసి, సీపీఆర్‌ అందించేందుకు పిలిచింది. అయితే అప్పటికే సమయం మించిపోయింది. విషయం ఆసుపత్రివర్గాలకు తెలియగానే కలకలం చెలరేగింది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పెనెలోప్‌ను విధుల నుంచి తొలగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆమెను ప్రశ్నించగా, అతను ఆరోజు డయాలసిస్‌ కోసం ఆసుపత్రికి వచ్చాడని  తెలిపింది. అయితే ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక మెసేజ్‌లో అతనికి చెస్ట్‌ పెయిన్‌ వచ్చినట్లు ఉంది. దీంతో పెనెలోప్‌ అబద్దం చెబుతున్నదని యాజమాన్యానికి స్పష్టమైంది. 

ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందంటూ..
ఆమె అతనికి ఫోను చేసి, ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందని దర్యాప్తులో తేలింది. అతను రాగానే వారిద్దరూ కారులో సరససల్లాపాల్లో తేలారు. సరిగ్గా అదే సమయంలో ఆ బాధితునికి గుండెపోటు వచ్చి, మృతి చెందాడు. ఆ నర్సు, బాధితునికి మధ్య గత రెండేళ్లుగా ఈ ఎఫైర్‌ ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆ బాధితుని పేరు వెల్లడించలేదు. ఈ విషయమై ఆసుపత్రి దర్యాప్తు కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ పెనెలోప్‌ విలియమ్స్‌ ఆ బాధితునితో తనకు ఎటువంటి సంబంధం లేదని, బాధితునికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, మృతి చెందాడని తెలిపిందన్నారు. 
ఇది కూడా చదవండి: తండ్రి మృతుని తట్టుకోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement