ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్‌తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్‌కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్‌లో వూల్‌విచ్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది.
ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్‌లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్‌బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్‌లోనే ఉందామే.
దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం.
(చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..)
Comments
Please login to add a commentAdd a comment