seizure
-
చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?
చిన్నారుల్లో ఫిట్స్ (సీజర్స్) రావడం సాధారణంగా చూస్తుండేదే. ఇలా ఫిట్స్ రావడాన్ని వైద్యపరిభాషలో ‘ఎపిలెప్సీ’గా చెబుతారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ... ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. ఈ సీజర్స్లోనూ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ అనేవి ఇంకాస్త వేరు. నాలుగేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్లో వచ్చే వీటి కారణంగా చిన్నారులు ఏ భంగిమలో ఉన్నా... ఉన్నఉన్నవారు ట్లుగానే వారు స్పృహ కోల్పోతారు. ఇవి పిల్లల్లో అకస్మాత్తుగా మొదలవుతాయి. హఠాత్తుగా వాళ్లను స్పృహలో లేకుండా చేస్తాయి. కనీసం 10 – 20 సెకండ్లు అలా ఉండిపోయి, మెల్లగా ఈలోకంలోకి వస్తారు. ఇలా హఠాత్తుగా కనిపించి, తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేసే ‘ఆబ్సెన్స్ సీజర్స్’పై అవగాహన కోసం ఈ కథనం. చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?పిల్లల్లో వచ్చే ఫిట్స్‌లో... ఆబ్సెన్స్ సీజర్స్ అనేవి కనీసం 20 నుంచి 25% వరకు ఉంటాయి. సాధారణంగా ఇవి జన్యుపరమైన (జెనెటిక్), జీవక్రియ పరమైన (మెటబాలిక్) సమస్యల వల్ల వస్తుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ‘ఆబ్సెన్స్ సీజర్స్’ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. అసాధారణంగా కొందరు చిన్నారుల్లో ఏడాదిలోపు వయసున్నప్పుడు కూడా ఇవి మొదలు కావచ్చు. చాలా మంది ఆరోగ్యకరమైన పిల్లల్లో హఠాత్తుగా మొదలైనప్పటికీ... కొందరు చిన్నారుల్లో మాత్రం... వారికి జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఫిట్స్‌తో ఇవి మొదలవుతాయి. అలాగే ఎదుగుదలలో లోపాలు (డెవలప్మెంటల్ డిలే) వంటి నాడీ సంబంధమైన సమస్యలున్నవారిలోనూ కనిపిస్తుంటాయి. ఇంక కొందరిలోనైతే... వాస్తవంగా కనుగొన్న నాటికి చాలా పూర్వం నుంచే... అంటే నెలలూ, ఏళ్ల కిందటి నుంచే ఇవి వస్తుంటాయి. కానీ తల్లిదండ్రులు (లేదా టీచర్లు) చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ... వీటినంత తేలిగ్గా గుర్తించడం సాధ్యం కాకపోవడంతో పిల్లలేదో పగటి కలలు కంటున్నారనీ, ఏదో వాళ్ల లోకంలో వాళ్లు ఉన్నారంటూ తల్లిదండ్రులు, టీచర్లు, లేదా పిల్లల్ని చూసుకునే సంరక్షకులు పొరబడుతూ ఉండవచ్చు. సాధారణ సీజర్స్‌లో అవి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆబ్సెన్స్ సీజర్స్‌లో అవి వచ్చిన దాఖలా కూడా స్పష్టంగా తెలియదు. కొన్ని సందర్భాల్లో చాలాకాలం వరకూ తెలిసిరాదు. ప్రేరేపించే అంశాలు... ఈ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ను కొన్ని అంశాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి... తీవ్రమైన అలసట వేగంగా శ్వాస తీసుకోవడం పిల్లలు టీవీ, మొబైల్ చూస్తున్నప్పుడు తరచూ హఠాత్తుగా మారిపోతూ ఉండే కాంతిపుంజాలూ, ఫ్లాష్లైట్ల కారణంగా... ఆబ్సెన్స్ సీజర్స్ రావచ్చు. ఆబ్సెన్స్ సీజర్స్ లక్షణాలు... ఈ సందర్భాల్లో పిల్లలు... అకస్మాత్తుగా చేష్టలుడిగి (బిహేవియర్ అరెస్ట్‌తో) నిశ్చేష్టులై ఉండిపోవడం ∙ముఖంలో ఎలాంటి కవళికలూ కనిపించకపోవడం ∙కళ్లు ఆర్పుతూ ఉండటం, ఒంటి మీద బట్టలను లేదా ముఖాన్ని తడబాటుగా చేతి వేళ్లతో నలపడం, నోరు చప్పరించడం, మాటల్ని తప్పుగా, ముద్దగా ఉచ్చరిస్తూ ఉండటం (ఫంబ్లింగ్), చేస్తున్నపనిని అకస్మాత్తుగా నిలిపివేయడం / ఆపివేయడం ∙బయటివారు పిలుస్తున్నా జవాబివ్వకపోవడం / ఎలాంటి స్పందనలూ లేకపోవడం పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాళ్లు బయటకు పూర్తిగా నార్మల్‌గానూ కనిపించవచ్చు. మాట్లాడటం మాత్రం చాలావరకు నార్మల్‌గా ఉండిపోవచ్చు. కొందరిలో మాత్రం కొంచెం అస్పష్టత కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ వారు ఆటలాడుకుంటున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడూ లేదా కొన్నిసార్లు నిద్రలో కూడా కొనసాగుతుంటాయి. చిన్నారులు అన్యమనస్కంగా ఉండటమో లేదా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించడాన్ని తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. నిర్ధారణ ఇలా... ఆబ్సెన్స్ సీజర్స్‌లో ఎన్నో రకాలున్నప్పటికీ... సాధారణంగా టిపికల్ (అంతగా సంక్లిష్టం కానివి), అటిపికల్ (సంక్లిష్టమైనవి) అనే రకాలు ఉంటాయి. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ఎమ్మారై (బ్రెయిన్) వంటి మరికొన్ని పరీక్షలతో వీటిని నిర్ధారణ చేయవచ్చు. ఇక అటిపికల్ రకాల విషయంలో ఇతర నాడీ సంబంధమైన సమస్యలనూ, జీవక్రియలకు(మెటబాలిక్) సంబంధించిన, జన్యుసంబంధమైన మరికొన్ని పరీక్షలతో పాటు మెదడు / వెన్నుపూస చుట్టూ ఉండే ద్రవం (సెరిబ్రో స్పైనల్ ఫ్లుయిడ్ – సీఎస్ఎఫ్)ను పరీక్షించడం ద్వారా ఈ (అటిపికల్) రకాన్ని తెలుసుకుంటారు. చికిత్స సమస్య నిర్దారణ అయిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఇందుకోసం ఫిట్స్ మందులు (యాంటీ సీజర్ మెడిసిన్స్) వాడాలి. వీటిని కనీసం రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడుతూ, బాధితుల మెరుగుదలను గమనిస్తూ, దాని ప్రకారం మోతాదును క్రమంగా తగ్గిస్తూ పోవాలి. ఈ మందులు చిన్నారుల్లో... కేవలం ఫిట్స్ తగ్గించడం మాత్రమే కాదు, వాళ్ల జీవన నాణ్యతనూ మెరుగుపరుస్తాయి. స్కూల్లో వాళ్ల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సామాజికంగా ఒంటరి కాకుండా... నలుగురితో కలిసిపోయేలా చేస్తాయి. మందుల గుణం కనిపిస్తోందా లేదా అన్న విషయాన్ని నిర్ణీత వ్యవధుల్లో ఈఈజీ తీయడం ద్వారా పరిశీలిస్తూ ఉండాలి. ఇక సహాయ చికిత్సలు (సెకండ్ లైన్ ట్రీట్మెంట్)గా వాళ్లకు కీటోజెనిక్ డైట్ (కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం) ఇవ్వడం, వేగస్ నర్వ్ అనే నరాన్ని ప్రేరేపించడం (వేగస్ స్టిమ్యులేషన్) జరుగుతుంది. దాదాపు 70 శాతం కేసుల్లో చిన్నారులు యుక్తవయసునకు వచ్చేనాటికి మంచి స్పందన కనిపిస్తుంది. (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!) -
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్‌లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
2 నెలల్లో రూ.26 కోట్ల డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నిషా ముక్త్ తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అద్భుత ఫలితాలు సాధిస్తోందని న్యాబ్ డైరెక్టర్, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వెల్లడించారు. జూన్–జూలై నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దాడుల్లో టీఎస్ న్యాబ్ అధికారులు 196 కేసులు నమోదు చేసినట్లు గురువా రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా 196 కేసుల్లో 175 గంజాయి దందాకు సంబంధించినవే. ఈ కేసుల్లో అధికారులు 353 మందిని అరెస్టు చేశారు. మరోపక్క 21 డ్రగ్స్ సంబంధిత కేసుల్లో 46 మందిని కటకటాల్లోకి పంపారు. వీరి వద్ద నుంచి స్వాదీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ.26,01,34,650గా నిర్థారించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు జూన్‌లో మూడు రోజుల పాటు మిషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. డ్రగ్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కీలక సమావేశం గత నెల 5న నిర్వహించారు. డ్రగ్స్ దందాకు చెక్ చెప్పడానికి డార్క్‌వెబ్ సహా ఆన్లైన్లో జరిగే అక్రమ లావాదేవీలు నిరోధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించారు. -
నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్‌తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్‌కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్‌లో వూల్విచ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్‌బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్‌లోనే ఉందామే. దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం. (చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..) -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా సిగరెట్లు పట్టివేత
-
ఫొటో ఫ్రేమ్‌ల్లో డ్రగ్స్!
సాక్షి, హైదరాబాద్: తమిళనాడుకు చెందిన ముఠాలు హైదరాబాద్ మీదుగా ఆస్ట్రేలియాకు డగ్స్ రవాణాకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జిమ్ ఉపకరణాల మధ్యలో ఓసారి, పరుపుల్లో మరోసారి విదేశాలకు సూడోఎఫిడ్రిన్ రవాణాకు యత్నించగా డీఆర్ఐ, ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో కేటుగాళ్లు రూటు మార్చారు. తాజాగా ఫొటో ఫ్రేమ్‌ల మధ్యలో ఈ డ్రగ్‌ను ఉంచి రవాణాకు యత్నించారు. డీఆర్ఐ అధికారులు ఇచ్చిన సమాచారంతో బేగంపేట పోలీసులు రూ. 5.5 కోట్ల విలువైన 14.2 కేజీల ‘సరుకు’ను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం తెలిపారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెనవర్, బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డితో కలసి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ మాట్లాడారు. ప్లాస్టిక్ కవర్లలో నింపి... సీపీ తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు డ్రగ్స్ గ్యాంగ్ సూడో ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియాకు పంపేందుకు పక్కా ప్రణాళిక రచించింది. డ్రగ్స్‌ను దాచేందుకు వివిధ ఫొటోలతో కూడిన ఫ్రేములను రెండు పొరలుగా తయారు చేయించింది. ఈ రెంటి మధ్యలో ఫ్రేముల సైజులోనే ఉన్న ప్లాస్టిక్ కవర్లలో సూడో ఎఫిడ్రిన్ నింపింది. ఫ్రేము పొరల మధ్య దీన్ని ఉంచి ప్లాస్టర్ వేసింది. ఇలా 18 కేజీల చొప్పున ఉన్న ఒక్కో కార్టన్ బాక్సులో 11 ఫ్రేములను ఉంచుతూ రెండు పార్శిల్స్ రూపొందించింది. వాటిని మంగళవారం బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఉన్న యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సంస్థ వద్దకు ఇద్దరు వ్యక్తులు తీసుకువచ్చారు. స్థానిక చిరునామాలతో కూడిన నకిలీ ఆధార్ కార్డులు చూపి వాటి ఆధారంగా ఫొటో ఫ్రేమ్‌ల పార్శిల్స్‌ను ఆస్ట్రేలియాకు బుక్ చేశారు. మొదటి దాన్ని సిడ్నీ శివార్లలో ఉన్న వెస్ట్‌మేడ్ ప్రాంతంలో గణేశన్ పెరుమాళ్‌కు, రెండో దాన్ని గ్రాన్వెల్లీలో రఘునాథ్ శరవణ్‌కు డెలివరీ చేయాలని కోరారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు సూడో ఎఫిడ్రిన్ అక్రమంగా రవాణా అవుతున్నట్లు డీఆర్ఐ అధికారులకు ఉప్పందడంతో వాళ్లు నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోని దిగిన బేగంపేట పోలీసులు యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ కొరియర్స్ సంస్థలో సోదాలు చేయగా 14.2 కేజీల డ్రగ్ బయటపడింది. ఈ పార్శిల్స్ బుకింగ్ చేసిన ఇద్దరినీ గుర్తించడానికి కొరియర్ సంస్థతోపాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను బేగంపేట పోలీసులు సేకరించారు. దీన్ని విశ్లేషిస్తూ నిందితుల్ని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాదిగా ప్రయత్నం... గత ఏడాదిగా తమిళనాడు ముఠా సూడో ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియాకు స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి సీ కార్గో, ఎయిర్ కార్గో, కొరియర్ల ద్వారా వివిధ రూపాల్లో పార్శిల్స్ చేసింది. ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేసిన డీఆర్ఐ... 300 కేజీలకుపైగా ఎఫిడ్రిన్ సీజ్ చేసింది. ఈ వ్యవహారంలో సూత్రధారుల కోసం అటు డీఆర్ఐ, ఇటు నగర పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: 'నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత.. -
దొంగనోట్లు దొరికింది అక్కడే..
సాక్షి,న్యూఢిల్లీ: నకిలీ నోట్లను వ్యవస్థ నుంచి ఏరివేసే ముఖ్యోద్దేశంతో చేపట్టిన నోట్ల రద్దు ఎలాంటి ఫలితాలిచ్చిందో పక్కనపెడితే తాజాగా కొత్త నోట్లనూ పెద్ద ఎత్తున నకిలీలు ముంచెత్తడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల వెల్లడైన డేటా ఆధారంగా నూతన కరెన్సీలోనూ నకిలీ నోట్లు, వాటి చెలామణి కొనసాగుతున్నట్టు వెల్లడైంది. నకిలీ నోట్లను గణనీయంగా సీజ్ చేసిన రాష్ర్టాల్లో గుజరాత్, బెంగాల్‌లు ముందువరుసలో ఉన్నాయి. నోట్ల రద్దు అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన రూ 2000 నోట్లలోనూ దొంగనోట్లు ఇబ్బడిముబ్బడిగా చొరబడ్డాయి. మొత్తం రూ కోటి 85 లక్షల విలువైన 9254 నోట్లు ఇప్పటివరకూ పట్టుబడ్డాయి. వీటిలో 89.7లక్షల విలువైన రూ 2000 నోట్లను కేవలం గుజరాత్‌లోనే స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో 26 లక్షల విలువైన రూ 2000 నోట్ల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. మరోవైపు నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా రూ 500 నకిలీ నోట్లు కూడా పెద్దమొత్తంలో పట్టుబడ్డాయి. రూ 70.9 లక్షల విలువైన రూ 500 నోట్లు 14,175 పట్టుబడ్డాయి. వీటిలో గుజరాత్‌లోనే రూ 48.1 లక్షల విలువైన 9621 రూ 500 నకిలీ నోట్లను సీజ్ చేశారు. బెంగాల్లో రూ 18.3 లక్షల విలువైన రూ 500 నకిలీ నోట్లను సీజ్ చేశారు. -
ఐటీ ఎన్నికోట్లు పట్టుకుందో తెలుసా!
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.4,663కోట్ల లెక్కలు చూపని ఆదాయాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ మొత్తం ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ అధికారులు సమాచారం. అంతేకాకుండా తాజాగా గుర్తించిన లెక్కచూపని వాటిల్లో రూ.562కోట్లను సీజ్ చేసినట్లు కూడా తెలిసింది. వీటిల్లో రూ.110కోట్లు కొత్త నోట్లు ఉన్నాయట. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 253 చోట్ల సోదాలు నిర్వహించినట్లు, 556 సర్వేలు చేసినట్లు, 289 చోట్ల సీజ్ చర్యలు తీసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. పన్నులకు సంబంధించి మొత్తం 5,062 నోటీసులు పంపించినట్లు కూడా వెల్లడించాయి. అంతకుముందు డిసెంబర్ 22నాటికి ఐటీ అధికారులు గుర్తించిన లెక్క చూపని ఆదాయం రూ.3,185కోట్లు. ఈ మొత్తాన్ని కూడా అప్పుడే వారు సీజ్ చేశారు. -
పురిటి నొప్పులతో విమానం దించివేత
చెన్నై: దుబాయిలోని ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. ప్రయాణీకుల్లో ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో చెన్నై విమానాశ్రయంలో దించివేశారు. అనంతరం ఓ వైద్య సహాయకురాలిని ఇచ్చి స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుబాయికి చెందిన ఈ విమానం ఇండోనేషియా నుంచి వస్తుండగా ఆమె తనకు నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో చెన్నైలో ఆపేయాల్సి వచ్చింది. మొత్తం 300 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నారు. మహిళను సురక్షితంగా దింపేసిన అనంతరం విమానం బయలు దేరింది. సదరు మహిళను గురువారం వేరే విమానంలో పంపిస్తామని అధికారులు తెలిపారు.