సాక్షి,న్యూఢిల్లీ: నకిలీ నోట్లను వ్యవస్థ నుంచి ఏరివేసే ముఖ్యోద్దేశంతో చేపట్టిన నోట్ల రద్దు ఎలాంటి ఫలితాలిచ్చిందో పక్కనపెడితే తాజాగా కొత్త నోట్లనూ పెద్ద ఎత్తున నకిలీలు ముంచెత్తడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల వెల్లడైన డేటా ఆధారంగా నూతన కరెన్సీలోనూ నకిలీ నోట్లు, వాటి చెలామణి కొనసాగుతున్నట్టు వెల్లడైంది. నకిలీ నోట్లను గణనీయంగా సీజ్ చేసిన రాష్ర్టాల్లో గుజరాత్, బెంగాల్‌లు ముందువరుసలో ఉన్నాయి. నోట్ల రద్దు అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన రూ 2000 నోట్లలోనూ దొంగనోట్లు ఇబ్బడిముబ్బడిగా చొరబడ్డాయి.
మొత్తం రూ కోటి 85 లక్షల విలువైన 9254 నోట్లు ఇప్పటివరకూ పట్టుబడ్డాయి. వీటిలో 89.7లక్షల విలువైన రూ 2000 నోట్లను కేవలం గుజరాత్‌లోనే స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 26 లక్షల విలువైన రూ 2000 నోట్ల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. మరోవైపు నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా రూ 500 నకిలీ నోట్లు కూడా పెద్దమొత్తంలో పట్టుబడ్డాయి. రూ 70.9 లక్షల విలువైన రూ 500 నోట్లు 14,175 పట్టుబడ్డాయి. వీటిలో గుజరాత్‌లోనే రూ 48.1 లక్షల విలువైన 9621 రూ 500 నకిలీ నోట్లను సీజ్ చేశారు. బెంగాల్‌లో రూ 18.3 లక్షల విలువైన రూ 500 నకిలీ నోట్లను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment