కోలుకున్న తర్వాత జాసన్ కెక్
లండన్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రమైన అనారోగ్యంతో చావును పలకరించి వచ్చారు. వీరంతా రోజులు, మహా అయితే రెండు, మూడు నెలల్లో కోలుకోవటమో.. ప్రాణాలు కోల్పోవటమో జరిగింది. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నం. కరోనా ప్రభావంతో ఏకంగా మూడు వందల రోజులు బెడ్‌కు పరిమితమయ్యాడు. కరోనా కారణంగా అత్యంత ఎక్కువకాలం బాధింపబడ్డ బ్రిటన్ వ్యక్తిగా రికార్డుకెక్కాడు. వివరాలు.. బ్రిటన్‌లోని వెస్ట్ యాక్స్‌కు చెందిన జాసన్ కెక్(49) మార్చి 31వ తేదీన కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడి కిడ్నీలు, ఉపీరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి.
(మరో రెండు విపత్తులు.. కోటి మరణాలు: బిల్‌గేట్స్)
ఇక అప్పటినుంచి సేయింట్ జేమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. నడవలేని పరిస్థితుల్లో బెడ్‌కే పరిమితమయ్యాడు. దాదాపు పది నెలలు పాటు ఇన్‌టెన్సివ్ కేర్ పైకప్పు చూస్తూ గడిపాడు. వైద్యులు తమ శక్తివంచనలేకుండా అతడ్ని కాపాడటానికి ప్రయత్నించి సఫలయ్యారు. అతడి ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుటపడుతోంది. తాజాగా పది నెలల తర్వాత నడవటం మొదలు పెట్టాడు. నర్సుల సహాయంతో జాసన్ నడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment