
సఫ్‌దార్‌జంగ్ ఆసుపత్రి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు బ్లాక్‌నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ ఇందిరా గాంధీ ఏయిర్‌పోర్టులో ఓ 35ఏళ్ల వ్యక్తిని కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో అధికారులు అక్కడినుంచి తరలించారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సఫ్‌దార్‌జంగ్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు.
రక్తపు నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. అయితే రిపోర్టు రాకమునుపే అతడు తనుంటున్న 7వ అంతస్తు బ్లాక్‌నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, పంజాబ్‌కు చెందిన అతడు గత సంవత్సరకాలంగా సిడ్నీలో ఉంటున్నాడని, ఎయిర్ ఇండియా విమానంలో న్యూఢిల్లీ చేరుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
చదవండి : కరోనా : ఒక్కరోజే 475 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment