డాక్టర్‌ని అని మహిళను మభ్యపెట్టి.. | Mangalsutra stolen by a man who dressed as a doctor at gandhi hospital | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ని అని మహిళను మభ్యపెట్టి..

Published Sat, Mar 18 2017 9:33 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

డాక్టర్‌ని అని మహిళను మభ్యపెట్టి..

డాక్టర్‌ని అని మహిళను మభ్యపెట్టి..

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో గర్భాశయ వ్యాధితో చేరిన ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును వైద్యుడి వేషంలో వచ్చిన ఓ వ్యక్తి అపహరించాడు. ఈ సంఘటన గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

మౌలాలీకి చెందిన రమా అనే మహిళ గర్భాశయ వ్యాధితో గురువారం గాంధీ అస్పత్రిలో చేరింది. చికిత్స నిమిత్తం ఆమెకు ఇంజెక్షన్‌ చేయాలని, మంగళసూత్రం అడ్డుగా ఉందని, ఆ గొలుసును తీయాలని వైద్యుడి వేషంలో వచ్చిన ఓ వ్యక్తి ఆమెను మభ్యపెట్టాడు. కొద్ది నిమిషాల్లోనే ఆ నాలుగు తులాల బంగారు గొలుసును కాజేసి ఆ అగంతకుడు పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రమా... చిలకలగూడ పోలీసు లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement