
ఈ–కామర్స్ కంపెనీ పేటీఎం.. అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ సిటీతో కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశ పెట్టింది. ఈ కార్డ్ పరిమితి లక్ష రూపాయిలు కాగా, ప్రతి కొనుగోలుపై ఒక శాతం క్యాష్‌బ్యాక్, రూ.50,000 లావాదేవీలు దాటితే వార్షిక ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేటీఎం చైర్మన్, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వివరించారు.
సాధారణ వినియోగదారులకు వార్షిక ఫీజు రూ.500 వసూలు చేయనున్నట్లు తెలిపారు. క్రెడిట్ కార్డుల సేవలను మరింత విస్తరించడంలో భాగంగా పేటీఎంతో కలిసి సేవలందిస్తున్నట్లు సిటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ స్టీఫెన్ బర్డ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment