
నీళ్లని జ్యూస్‌గా మారుస్తుంది!
రోజులో ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిదని చెబుతుంటారు డాక్టర్లు. కానీ కొంతమందికి అది ఇష్టం ఉండదు. అన్ని నీళ్లు ఎవరు తాగుతారు అనుకుంటారు. అలాంటివాళ్లకి నీటి మీద ఆసక్తిని, ఇష్టాన్ని పుట్టిస్తుందీ వాటర్ బాటిల్. దీన్ని ఇన్‌ఫ్యూజింగ్ వాటర్ బాటిల్ అంటారు. మొదట సీసాలో నీళ్లు నింపాలి. తరువాత... ఈ బాటిల్ మూతకు ఉన్న ఒక గొట్టం లాంటి దానిలో... మనకు ఇష్టమైన పండ్ల ముక్కలు వేసి మూతను సీసాకు బిగించాలి.
దీన్ని ఇలా కాసేపు ఉంచితే... ఆ గొట్టానికున్న అతి చిన్న రంధ్రాల ద్వారా పండ్ల రసం కొద్దికొద్దిగా నీటిలో కలుస్తుంది. వాటి వాసన నీటికి అంటు కుంటుంది. దాంతో నీళ్లు తాగినా జ్యూస్ తాగిన ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా స్కూలుకు తీసుకెళ్లడానికి పిల్లలకు ఇవి ఇస్తే... సరదా పడి అయినా నీళ్లన్నీ తాగేస్తారు. ఈ బాటిల్ ధర ఒక్కోటీ రూ. 300 పైనే పలుకు తోంది. భవిష్యత్తులో తగ్గే అవకాశం లేకపోలేదు. ఆన్‌లైన్లో అయితే డిస్కౌంట్స్ ఉంటాయి.