కుటుంబ బాధ్యతల్లో పడి చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించు కోరు. నిజానికి రుతుస్రావం, గర్భధారణ, పిల్లల పోషణ లాంటి గురుతర బాధ్యతలను నిర్వహించే మహిళలు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో మహిళల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి బలాన్నిచ్చే ఒక జ్యూస్ గురించి తెలుసుకుందాం.
క్రాన్‌బెర్రీ జ్యూస్. క్రాన్‌బెర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి.. ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా కాపాడతాయి
ఉత్తర , దక్షిణ అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఐరోపాలో ఎక్కుగా సాగు చేస్తారు. ఎరికేసి కుటుంబానికి చెందిన వీటిని శాస్త్రీయంగా వ్యాక్సినియం ఆక్సికోకోస్ లేదా వ్యాక్సినియం మాక్రోకార్పన్ అని పిలుస్తారు. ఇవి పుల్లగా, తీయగా, కొంచెం చేదు కలగలిసిన రుచితో గమ్మత్తుగా ఉంటాయి.
క్రాన్‌బెర్రీ జ్యూస్ ప్రయోజనాలు
నారింజ లేదా యాపిల్ లాంటి ఇతర జ్యూస్‌ల వలె ప్రాచుర్యం పొందనప్పటికీ, క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో అనేక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్వచ్ఛమైన క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో సీ, ఈ విటమిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి విలువైన ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి వయస్సు-సంబంధిత సమస్యలు, జబ్బులకు చెక్ పెడతాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాలు పేరుకుపోతాయి. క్రాన్‌బెర్రీ జ్యూస్‌లోని కొన్ని రసాయనాలు యాంటీఆక్సిడెంట్లు వీటిని అడ్డుకుంటాయి.
- కేన్సర్, మధుమేహం, గుండె వ్యాధి, జీర్ణ ఆరోగ్యం, మూత్ర నాళం ఆరోగ్యానికి చాలా మంచిది.
- క్రాన్‌బెర్రీ జ్యూస్‌లోని వివిధ పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రాన్‌బెర్రీస్‌లో పాలీఫెనాల్స్ అనే రసాయనాలు ఇందుకు తోడ్పడతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న ఆడవారిపై 2011లో జరిపిన అధ్యయనంలో క్రాన్‌బెర్రీ జ్యూస్ రక్త ప్లాస్మాలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతుందని కనుగొన్నారు.
- క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను తీసుకునేవారిలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుడ్ కొలెస్ట్రాల్‌లెవల్స్ పెరుగుతాయి.
- కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారికి క్రాన్‌బెర్రీ జ్యూస్ ఒకబెస్ట్ ఆప్షన్. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మరో అధ్యయనంలో తేలింది.
- ముఖ్యంగా మహిళలు క్రాన్బెరీతో చేసే జ్యూస్ తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. అదే విధంగా యూరిన్‌లో వచ్చే మంట, దురదకు ఉపశమనం లభిస్తుంది.
- శరీరంలో మంట, దురద, చికాకు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఎంజైమ్స్‌ని పెంచుతాయి.
- రూమటాయిడ్ ఆర్ర్థరైటీస్, కాలిటీస్, ఎథెరోక్లోరోసిన్, అల్జీమర్స్ పెరడెంటైటీస్, డయాబెటీస్ వంటి బారిన పడకుండా కాపాడుతుంది.
- చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల వల్ల చర్మానికి, ముఖంలో మంచి మెరుపు వస్తుంది.
ఈ జ్యూస్ తాగడం వల్ల ఫినోలిక్ యాసిడ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు బాడీకి మంచి డిటాక్స్ డ్రింక్‌లా పని చేస్తుంది.
నోట్: కొన్ని పరిశోధనల ప్రకారం వార్ఫరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ , కొన్ని రకాల యాంటి బయెటిక్స్ వాడేవారు క్రాన్‌బెర్రీకి దూరంగా మంచిది. వైద్యుల సలహా మేరకుతీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment