
ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఒక జ్యూస్ షాప్ యజమాని చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ యజమాని ఏటీఎంనే ఏకంగా జ్యూస్ షాప్‌గా మార్చేశాడు. సాధారణంగా ఏటీఎం లోపల ఒక వ్యక్తి ఉంటేనే మరో వ్యక్తిని లోనికి అనుమతించరు. అలాంటిది ఏటీఎం మిషన్‌ను ఒక మూలకు నెట్టి మరీ అతను లోపల కుర్చీలు వేసేశాడు. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బలు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చిన వారిని కుర్చీలో కూర్చోండి అంటూ మర్యాదలు కూడా చేస్తున్నాడు.
చాలా మంది అక్కడ కూర్చొని ఉండగానే కస్టమర్లు వారి ఏటీఎం లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని బట్టి ఏటీఎంలు ఎంత రిస్క్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీ ఏటీఎం పిన్‌లను, ఓటీపీలను ఎవరికి తెలియనివ్వద్దు అంటూ బ్యాంకులు ప్రతిసారి మెసెజ్‌లు పంపుతూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటిది ఈ వ్యక్తి ఏటీఎంను జ్యూస్ షాప్‌గా మార్చడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. ఇది పూర్తిగా బ్యాంక్ ఏటీఎం నిబంధనలకు విరుద్ధం. ఏటీఎం రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి లోపల ఉంటే మరో వ్యక్తి అక్కడ ఉండటానికి వీలు లేదు.
సాధారణంగా ప్రతి ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అయితే ఈ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ ఎందుకు లేదో తెలియడం లేదు. అంతేకాకుండా బ్యాంకు అధికారులు ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదైనా సాంకేతిక లోపలు తలెత్తినప్పుడు అధికారులు అక్కడికి వచ్చే ఉంటారు. అప్పుడు కూడా వారు జ్యూస్ యజమానిని ఎందుకు హెచ్చరించలేదు? అసలు ఆ వ్యక్తిపై బ్యాంక్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ వీడియో చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో సదరు వ్యక్తిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
వైరల్: జ్యూ స్ షాప్‌గా మారిపోయిన ఏటీఎం
Autoplay
ONOFF
Comments
Please login to add a commentAdd a comment