
పెరిగిన బరువును తగ్గించు కోవడం కోసం చాలామంది నానా పాట్లు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్‌ను తీసుకుంటే బరువు తగ్గడమే కాదు బాడీ మొత్తం డిటాక్స్ కూడా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆ జ్యూస్ ఏంటీ..? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి..? వంటి విషయాలపై ఓ లుక్కేద్దామా?
ముందుగా ఒక క్యారెట్, ఒక కీరదోస తీసుకోవాలి. వాటికి చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పియర్ పండును కూడా తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు, పియర్ పండు ముక్కలు, గింజ తొలగించిన మూడు ఖర్జూరాలు, చిటికెడు పింక్ సాల్ట్, చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్–కీర–పియర్ జ్యూస్ సిద్ధమైనట్లే. ఈ జ్యూస్‌ను ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల అందులో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు శరీరంలోని వ్యర్థాలను తొలగించి బాడీని డిటాక్స్ చేస్తాయి. అలాగే అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. అతి ఆకలి సమస్యను దూరం చేస్తాయి. కాబట్టి, ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో.. వారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకునేందుకు ప్రయత్నించండి.
చదవండి: Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్‌సి అయ్యింది