ఓ మై డాగ్..
గ్రీకు భాషలో ‘జ్యూస్’ అంటే ఏమిటో తెలుసా? దేవుడని. ఈ దేవుడు నా దగ్గరకు వచ్చి ఇది ఎయిత్ ఇయర్. అమెరికాలో ఉన్నప్పుడు 10థౌజండ్ డాలర్స్ ఖర్చుతో.. త్రీ మంత్స్ వయసులో నా ఒడిలో పడింది. ‘వైర్‌హెయిర్ పాయింటిన్ గ్రిఫాన్’ అనేది దీని బ్రీడ్. మన దేశంలో నా దగ్గర మాత్రమే ఉందీ బ్రీడ్. ఇప్పుడు అదే నా ప్రపంచం అయింది. ఇల్లంతా గిర్రున అది తిరుగుతుంటే... నేను రాగానే హైస్పీడ్‌లో వచ్చి నన్ను చుట్టేసుకుంటుంటే... వావ్... ఆ ఫీలింగ్ చెప్పలేను. మీకో విషయం తెలుసా? మేమిద్దరం కలిసి ‘చందమామ కథలు’లో కలసి నటించాం కూడా.
- మంచులక్ష్మి