బరువు తగ్గడానికి కొందరు రకరకాల ప్రయత్నాలు చేసి విసిగి పోతుంటారు. అయితే కొన్ని రకాల జ్యూస్‌లు తాగడం వల్ల కూడా సులువుగా బరువు తగ్గవచ్చు. అవేమిటో, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
గోధుమగడ్డి జ్యూస్‌ను పొద్దున్నే కాఫీ టీ బదులుగా తాగటం వల్ల తొందరగా సన్నబడతారు. దీనికి కావాల్సిన గోధుమగడ్డిని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులోఐరన్ , కాల్షియం, మెగ్నిషియం, ఫైటో న్యూట్రియెంట్లు,అమైనోయాసిడ్లు, విటమిన్‌లు ఎ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. గోధుమగడ్డి జ్యూస్‌ను తరచూ తీసుకోవడం వల్ల, శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి, ఈజీగా అధిక బరువు తగ్గిస్తుంది
బీట్రూట్, క్యారెట్ జ్యూస్
రోజు ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఒక బీట్రూట్, రెండు క్యారెట్లు కలిపి జ్యుస్‌లా తయారు చేసుకోవాలి. ఇందులోని విటమిన్ ఏ, సి, ఫైబర్ పుష్కలంగా లభించి,అధిక బరువును తొందరగా తగ్గించడానికి ఉపయోగపడతాయి.
కరివేపాకు జ్యూస్
దీనికోసం గుప్పెడు కరివేపాకు తీసుకొని, గ్లాసు నీళ్లలో వేసి మరిగించుకోవాలి. ఇందులో స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం కలిపి తాగడం వల్ల తొందరగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. కరివేపాకులో ఫోలిక్ యాసిడ్, ఐరన్ లభిస్తాయి. ఇందులోని లిపిడ్లు, అమైనో ఆమ్లాలు పొట్ట కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
బొప్పాయి జ్యూస్...
టిఫిన్‌కి బదులుగా బొప్పాయి జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులోని పైబర్ ΄÷ట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. అంతే కాక ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పుచ్చకాయ జ్యూస్...
పుచ్చకాయ జ్యూస్‌ని తరచూ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా ΄÷ట్ట నిండిన భావన కలుగుతుంది. దీనితో తినాలనే కోరిక తగ్గి, తొందరగా బరువు తగ్గవచ్చు.
నిమ్మ జూస్
నిమ్మరసం తేనె కలిపి తాగుతూ వుంటే తొందరగా పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. దీనితో తినాలనే కోరిక తగ్గి, తొందరగా బరువు తగ్గవచ్చు.
(చదవండి: మ్యాంగో మ్యాన్)
Comments
Please login to add a commentAdd a comment