
రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని పెంపొందించే బొప్పాయి మేని నిగారింపులోనూ మెరుగైన ఫలితాలను అందిస్తుంది.
►బొప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే మలినాలు తొలగిపోతాయి. చేతులు, పాదాలపై ఉన్న ట్యాన్ వదిలిపోతుంది.
►అరకప్పు బొప్పాయి గుజ్జులో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలు, చేతులు, ముఖానికి రాసి మసాజ్ చేయాలి. పదినిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదుత్వం పెరుగుతుంది. పొడిబారిన చర్మానికి ఇది మేలైన ప్యాక్.
►టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వారంలో మూడుసార్లయినా ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డు తగ్గి, నిగారింపు పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment