లండన్: కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి కొట్టి పారేసింది. మొబైల్ ప్రపంచంలో 5జీ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీ ఓ విప్లవం లాంటిది. అయితే ఈ 5జీ టెక్నాలజీ కరోనా వ్యాప్తికి కారణం అవుతోందంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం, దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వైరస్ వ్యాప్తికి, 5జీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం లేదని ఐక్యరాజ్యసమితి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన విభాగం అధికార ప్రతినిధి మోనికా గెనెర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment