ఒకవైపు కరోనా.. మరోవైపు మండుతున్న ఎండలు.. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం అవసరమని చెబుతున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలపై ప్రత్యేక కథనం – తూప్రాన్
ఎండ కాలంలో ముఖ్యంగా శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. కనుక మంచినీరు సాధారణం కన్నా అధికంగా తీసుకోవాలి. శరీరంలోని సోడియం చెమట రూపంలో బయటకు వెళ్లడంతో తలనొప్పి, తలతిరగటం, నీరసంతో పాటు కొంత మందికి విరేచనాలు కూడా ఆవుతాయి. రోజూ సుమారు ఆరు లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు సుమారు రెండు లీటర్లకు పైగా నీటిని తీసుకావాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల ఏలాంటి వ్యాధులు సొకావు. కనుక వేసవిలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా పలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతంగా ఉండవచ్చు.
శరీరానికి ఏం అవసరం..
⇔ వేసవి కాలంలో లభించే కర్భూజాలో శరీరానికి అవసరమైన నీటితో పాటు పోషకాలు అభిస్తాయి. పీచుపదార్థం కూడా అధికంగా ఉంటుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నిషియం,
⇔ వేసవి అనగానే మనకు పుచ్చకాయలు గుర్తుకు వస్తాయి. ఇందులో నీటిశాతం అధికంగా ఉంటుంది. దీనిలో కార్బొహైడ్రేట్స్, ప్రోటిన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
⇔ కొబ్బరి బొండం ఎంతో మేలు..
⇔ వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి.
⇔ తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.
⇔ కాల్షియం, మేగ్నిషియం, ఐరన్, పోటాషియం అధికంగా ఉంటాయి.
⇔ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. కనుక అధికంగా కొబ్బరి బొండం తాగడం శ్రేయస్కరం.
బయటకెళ్లేటప్పుడు ఇవి పాటించాలి...
⇔ తప్పనిసరిగా ఇంటి నుంచి బయటకు వేళ్లాల్సి వస్తే తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసారిగా ఉపయోగించాలి.
⇔ ఆల్ట్రావైలెట్ కిరణలు శరీరంపై పడినప్పుడు సన్ బర్న్స్, స్కిన్ ఇన్ ఫెక్షన్(చర్మ వ్యాధులు) రాకుండా సన్ స్కీన్ లోషన్ రాసుకోవాలి.
⇔ ఎండలో తిరుగుతున్నప్పుడు కళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి కోసం రోజ్ వాటర్ వేయడం, కళ్లపై కీర దోసకాయ ముక్కలు ఉంచడం చేయాలి.
⇔ కాటన్ దుస్తులు వేసుకోవడం శ్రేయస్కరం.
పండ్ల రసాలతో ఉపశమనం...
ఎండలో తిరిగి బయట నుంచి రాగానే వెంటనే పండ్ల రసాలు తీసుకోవడం వల్ల కొంత వరకు ఎండ నుంచి వచ్చే వేడిన, వడదెబ్బను నివారించవచ్చు. పైనాపిల్, ద్రాక్ష, రసాలతో పాటు క్యారెట్ జ్యూస్ కొంత ఉపశమనం కల్గిస్తుంది.
ప్రథమ చికిత్స...
కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. అప్పటి వరకు రోడ్లపైకి ప్రజలు రావొద్దని పిలుపునిచ్చింది. ఏదైన అత్యవసర పరిస్థితుల్లో ఎండలో తిరిగి అనారోగ్యంకు గురైతే శరీరంపై ఐస్‌ముక్కలు లేదా తడిగుడ్డలు ఉంచడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు. గ్లూకోజ్, ఎలక్ట్రాల్ పౌడర్, కొబ్బరి బొండం నీరు తాగితే మంచిది. అలాగే చల్లని గాలి తగిలేలా పడుకోవాలి.
ఎండతో కలిగే పరిణామాలు..
దేశంలో కరోనా వైరస్... ఎండల తీవ్రతతో జాగ్రత్తలు పాటించకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనారోగ్యంకు గురయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎండలో ఎక్కువ తిరిగితే వడదెబ్బ సోకుతుంది. తలనోప్పి, జ్వరం, వాంతులు, ఓకారం, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎండ ప్రభావం మెదడుపై పడి శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దీంతో కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎండాకాలం కరోనాతో పాటు, ఎండనుంచి కాపాడుకునే చర్యలు తీసుకోవాలి.– కొమరయ్య, డాక్టర్
ఆహార నియమాలు
⇔ నాన్‌వెజ్ కంటే పప్పు, కూరగాయలు, ఆకు కూరలు అధికంగా తీసుకోవాలి. దోస, కీరదోస తింటే మంచిది.
⇔ వేపుడు కూరలకు స్వస్తిపలికి, పులుసులకు పాధాన్యత ఇవ్వాలి.
⇔ సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి.
⇔ ద్రాక్ష, పుచ్చకాయ ఎక్కువగా తినాలి.
⇔ రోజుకు 4 నుంచి 5 లీటర్ల కాని చల్లార్చిన నీరు తాగాలి. గ్లూకోజ్, కొబ్బరి నీళ్లు తాపాన్ని తగ్గిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment