
సాక్షి, అమరావతి: డయాబెటిక్, హైపర్‌టెన్షన్ బాధితులు ఆ రెంటినీ అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి అదుపులో ఉన్నట్లయితే కరోనా పాజిటివ్ వచ్చినా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటామని చెబుతున్నారు. నియంత్రణలో లేకుంటే ఇమ్యూనిటీ గణనీయంగా తగ్గిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు.
► డయాబెటిక్, హైపర్ టెన్షన్ వ్యాధిగ్రస్తులు హైరిస్క్ కేటగిరీలో ఉన్నట్టు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
► కరోనా పాజిటివ్ వస్తే.. మిగతా వారితో పోలిస్తే వీరికే ఎక్కువ ప్రమాదం.
► ఇమ్యూనిటీ స్థాయి తక్కువగా ఉంటే కరోనా వైరస్ తక్కువ సమయంలోనే ఊపిరితిత్తులకు చేరుతుంది.
► షుగర్ స్థాయి నియంత్రణలో ఉండేలా తగిన ఆహారం, చిన్నపాటి వ్యాయామాలు అవసరం.
► హైపర్ టెన్షన్ బాధితులు యోగా వంటివి చేయాలి.
► హెచ్‌ఐవీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకూ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.