రెండోసారీ రావొచ్చు | Doctors Advice About Coronavirus | Sakshi
Sakshi News home page

రెండోసారీ రావొచ్చు

Published Sun, Jul 12 2020 4:01 AM | Last Updated on Sun, Jul 12 2020 4:01 AM

Doctors Advice About Coronavirus - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా రాకుండా తనను తాను కాపాడుకోవడం ఒకటైతే.. వచ్చాక కోలుకునే వరకూ జాగ్రత్తలు తీసుకోవడం మరొకటి. అయితే.. కొంతమంది ఒకసారి కరోనా సోకి తగ్గిపోతే తర్వాత తమనేమీ చేయదనుకుంటున్నారు. ఒకసారి కోలుకుంటే కరోనాను జయించినట్టేనని ధీమాగా ఉంటున్నారు. కానీ, ఒకసారి కరోనా వస్తే రెండోసారి రాకూడదనే నిబంధన ఎక్కడా లేదని.. రెండోసారి కూడా వచ్చిన వారు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

► ఉదాహరణకు విశాఖలోని వైరాలజీ ల్యాబ్‌లో పనిచేసే ఓ వ్యక్తికి రెండోసారి కూడా కరోనా వచ్చింది.
► ఒకసారి వచ్చి తగ్గిపోయింది కదాని మాస్కులు, శానిటైజర్‌ వాడకుండా ఇష్టారాజ్యంగా తిరగడం మంచిది కాదు.
► ఇమ్యూనిటీ తగ్గితే కరోనా వైరస్‌ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
► ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే కరోనా ఎలా సోకదో.. అది లేకపోతే పదే పదే వచ్చే అవకాశమూ ఉంటుంది
► వైరస్‌ ఒకసారి సోకి కోలుకున్న తర్వాత కూడా యథావిధిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
► ఇమ్యూనిటీని పెంచే ఆకు కూరలు, కాయగూరలు, గుడ్లు ఆహారంగా తీసుకోవాలి. తరచూ వ్యాయామం చేయాలి.

ఇమ్యూనిటీ తక్కువ ఉన్న చోటే కరోనా
ఈ వ్యాధి ఒక్కసారి వస్తే మళ్లీ రాదనేది ఎక్కడా లేదు. ఇమ్యూనిటీ ఎవరిలో తక్కువగా ఉంటే వారికి ఇది సోకుతుంది. ప్రధానంగా గుండె జబ్బులున్న వారు ఈ వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు వహించాలి. తరచూ వ్యాయామం చేస్తూ ఇమ్యూనిటీని పెంపొందించుకోవాలి.
– డాక్టర్‌ కె.ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement