పాప ఒంటి మీద పులిపిర్లు | A Type Of Skin Infection Caused By A Virus | Sakshi
Sakshi News home page

పాప ఒంటి మీద పులిపిర్లు

Published Mon, Nov 4 2019 3:32 AM | Last Updated on Mon, Nov 4 2019 3:32 AM

A Type Of Skin Infection Caused By A Virus - Sakshi

మా అమ్మాయికి పదకొండేళ్లు. ఆమెకు ముఖం మీద, దేహం మీద అక్కడక్కడా చిన్న  చిన్న పులిపిరి కాయల్లాంటివి వస్తున్నాయి అవి రోజురోజుకూ పెరుగుతుండటంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. మా పాపకు ఇవి ఎందుకొస్తున్నాయి? పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి.

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే... మీ పాపకు ఉన్న కండిషన్‌ ములస్కమ్‌  కంటాజియోజమ్‌ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్‌ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి.  ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మానికి చర్మం రాసుకోవడంతో పాటు... అప్పటికీ ఈ వ్యాధి కలిగి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల దేహం నుంచి మళ్లీ వాళ్ల చర్మం మీద మరోచోటికి వ్యాపించడం కూడా చాలా సాధారణం.

దీన్నే సెల్ఫ్‌  ఇనాక్యులేషన్‌ అంటారు. అలర్జిక్‌ డర్మటైటిస్‌ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ  లీజన్స్‌ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడు పు కింద (గ్రోయిన్‌), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.

చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్‌ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్‌ మెడిసిన్స్‌.... అంటే ఉదాహరణకు ఇ మిక్యుమాడ్‌ అనే క్రీమ్‌ను లీజన్స్‌ ఉన్న ప్రాం తంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చా లా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్‌ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉం టుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి.

బాబుకు మాటిమాటికీ జలుబు
మా బాబుకు పన్నెండేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ వద్దన్నా మానడు. పైగా ఇప్పుడు చలి బాగా పెరగడంతో... తనకు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని తరచూ కంప్లైంట్‌ చేస్తున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు రాసి ఇచ్చారుగానీ ప్రయోజనం కనిపించడం లేదు.  బాబుకు ఇలా తరచూ జలుబు రావడం తగ్గడానికి మార్గం చెప్పండి.

మీ బాబుకు ఉన్న కండిషన్‌ను అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు. అందులోనూ మీ బాబుకు ఉన్నది సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌  లక్షణాలు ఆరేళ్ల వయసు తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో జలుబు, ముక్కు దురద, కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ సమస్య చాలా సాధారణం. దీనికి నిర్దిష్టమైన కా రణం చెప్పలేకపోయినప్పటికీ వంశపారపర్య ం గా కనిపించడంతో పాటు వాతావరణ, పర్యావర ణ మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి.

పూలమొక్కలు, దుమ్ము, ధూళి, పుప్పొడి, రంగులు, డిటర్జెంట్స్‌ వంటివి శరీరానికి సరిపడకపోవడంతో వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు. మీ బాబుకు యాంటీహిస్టమైన్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, ఇంట్రానేసల్‌ స్టెరాయిడ్‌ స్ప్రేస్‌ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చల్లటి పదార్థాలు తగ్గించడం, సరిపడనివాటికి దూరంగా ఉంచడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్,
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement