కత్రినా కైఫ్
‘‘కరోనా వైరస్ కారణంగా తలెత్తిన పరిస్థితులు జీవితం పట్ల నాకు ఉండే దృష్టి కోణాన్ని మార్చివేశాయి’’ అంటున్నారు కత్రినా కైఫ్. ఈ విషయం గురించి కత్రినా వివరంగా చెబుతూ– ‘‘ప్రపంచం మొత్తం ముందుకెళుతున్న సమయంలో కరోనా వచ్చి వెనక్కి నెట్టేసింది. కరోనాకు ముందు మన జీవితాలు ఎలా సాగాయి? అని ఆలోచిస్తే.. ఇకముందు అప్పటి పరిస్థితులు ఉంటాయా? అనే సందేహం కలుగుతోంది. మన సాధారణ జీవితం మనకు తిరిగి ఎప్పుడు లభిస్తుందో చెప్పలేం. దేశంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవిగా ఉండటమే ఉత్తమం. నలుగురితో కలిసిమెలిసి ఉండాలంటారు. కానీ ఇప్పుడు నలుగురి క్షేమం కోసం దూరంగా ఉండటమే మంచిది. కరోనాని తరిమేశాక ఈ దూరాన్ని కూడా తరిమేద్దాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment