
సాక్షి, కృష్ణా: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ప్రధాన సూత్రధారుడు, ఈ కేసులో ఏ1 నిందితుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అవినీతి కేసులో అరెస్ట్‌కావడంతో.. సోషల్ మీడియాలోనూ కరెప్షన్ కింగ్ పేరుతో చంద్రబాబు ఆటాడేసుకుంటున్నారు. అయితే ఓవైపు పార్టీ అధినేత కోసం ఆందోళనకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే.. ఓ నేత మాత్రం స్వీట్లు పంచుతూ వేడుక చేశారు. శనివారం మధ్యాహ్నాం విజయవాడ కోర్టు వద్ద ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది.
టీడీపీ నేత చంద్రబాబునాయుడును అరెస్టు చేసినందుకు విజయవాడ కోర్టు వద్ద స్వీట్స్ పంచి పెడుతూ కనిపించారు టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర రావు. ఈ క్రమంలో ఆయన్ని అంతా విచిత్రంగా చూశారు. అయితే ఈ చర్య టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండడంతో.. ఆయన్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఆకుల వెంకటేశ్వరరావు తనను చంపేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నారంటూ ఈ మధ్యే ఆరోపణలు గుప్పించారు. ‘పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న. జూబ్లీ హిల్స్ లో 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కే ఎల్. నారాయణ లాకున్నారు. న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోవడంలేదు. నన్ను వాడుకొని వదిలేశాడు. నాకు చంద్రబాబు అన్యాయం చేశారు. పార్టీ లేదు, ఏమీ లేదు అని వ్యాఖ్యానించిన అచ్చెనాయుడిని టీడీపీ అధ్యక్షుడిని చేశారు’ అని ఆ సమయంలో ఆకుల వెంకటేశ్వరరావు వాపోయారు.
సంబంధిత వార్త: నాకు లోకేష్ నుంచి ప్రాణహాని ఉంది
Comments
Please login to add a commentAdd a comment