ఈసారి స్వీట్లు పంచుకోవట్లేదు | ban sweets to share with pak at vagah boarder | Sakshi
Sakshi News home page

ఈసారి స్వీట్లు పంచుకోవట్లేదు

Published Thu, Aug 13 2015 5:10 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

ఈసారి స్వీట్లు పంచుకోవట్లేదు

ఈసారి స్వీట్లు పంచుకోవట్లేదు

న్యూఢిల్లీ: ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత్ సైనికులు పాక్ సైనికులతో కరచాలనం చేయడం లేదు. ఇరువైపుల తీపి పదార్థాల పంపకాలు జరగడం లేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్-పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కరచాలనం చేసుకోవడం, వందనం చేసుకోవడంతోపాటు స్వీట్లు పంచుకుంటారు.

కానీ, ఈసారి ఆ సంప్రదాయానికి గండపడింది. అందుకు ప్రధాన కారణం ఇటీవల పాక్కు చెందిన ఉగ్రవాదులు బీఎస్ఎఫ్కు చెందిన ఇద్దరు జవాన్లపై కాల్పులు జరపడంతో వారు ప్రాణాలుకోల్పోయారు. ఈ ఘటనను పాక్ ఖండించకపోవడంతోపాటు, పలుమార్లు సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్నా చూసిచూడనట్లు వ్యవహరించింది. అందుకు నిరసనగా ఈసారి స్వీట్ల పంపకాన్ని ఆపేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement