సోనాక్షీ సిన్హా
‘మెటీరియల్ సెలెక్ట్ చేశారా? లెంగ్త్ సరిగ్గా చూసుకున్నారా? జాగ్రత్తగా... కరెక్ట్‌గా కట్ చేయండి!’ సినిమాల్లోకి రాకముందు తన గ్రూప్‌తో సోనాక్షీ సిన్హా ఇలాంటి మాటలే మాట్లాడేవారు. ఎందుకంటే తను అప్పుడు ఫ్యాషన్ డిజైనర్. సినిమాల్లోకి వచ్చాక వేరే డిజైనర్స్‌తో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేయించుకుంటున్నారీ బ్యూటీ. ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్ డిజైనర్ అవతారం ఎత్తారు. అదీ సినిమా కోసమే. ‘వెల్కమ్ టు న్యూయార్క్’ అనే సినిమాలో సోనాక్షి ఈ పాత్రను చేస్తున్నారు. ఇందులో దిల్జిత్ హీరో. ‘‘రియల్ లైఫ్‌లో ఫ్యాషన్ డిజైనర్ స్టూడెంట్‌ని. ఇప్పుడు రీల్‌పై ఆ పాత్ర చేస్తున్నాను.
కట్టింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ వంటి అంశాలపై నాకు గ్రిప్ ఉంది. అప్పట్లో మా బ్యాచ్‌లో టాపర్ నేనే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది నాకు’’ అన్నారు సోనాక్షి. సో.. ఈ పాత్రలో జీవించేస్తారన్నమాట. పైగా ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. ఈ చిత్రానికి మన తెలుగు కుర్రాడు చక్రి తోలేటి దర్శకుడు. కమల్‌హాసన్ ‘ఈనాడు’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యారు చక్రి. ఆ తర్వాత అజిత్ ‘బిల్లా 2’కి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నయనతార ‘కొలైయుదిర్ కాలమ్’కి, అదే చిత్రం హిందీ వెర్షన్ ‘కామోషీ’కి దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment