సీక్రెట్‌గా ప్రముఖ సింగర్‌ వివాహం.. ! | Diljit Dosanjh Is Married To Indian American Woman Has A Son | Sakshi
Sakshi News home page

Diljit Dosanjh: సీక్రెట్‌గా సింగర్‌ వివాహం.. ఓ కుమారుడు కూడా!

Published Tue, Apr 9 2024 6:11 PM | Last Updated on Tue, Apr 9 2024 9:38 PM

Diljit Dosanjh Is Married To Indian American Woman Has A Son - Sakshi

ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్‌ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల క్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం పరిణీతి చోప్రాతో కలిసి అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో నటించారు.  ఈ మూవీ  నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 12న  స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా దిల్జీత్‌ దోసాంజ్‌ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దిల్జీత్‌ ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు అతని స్నేహితుడు ఒకరు వెల్లడించారు. ఇండియా మూలాలున్న అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అంతే కాదు వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని భార్య, కుమారుడు అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పారు. దిల్జీత్‌ తల్లిదండ్రులు మాత్రం పంజాబ్‌లోని లుథియానాలో ఉన్నారని అన్నారు. కాగా.. గతంలో గుడ్ న్యూజ్ మూవీ ప్రమోషన్స్‌లో కియారా అద్వానీ అనుకోకుండా దిల్జిత్‌కు ఒక కొడుకు ఉన్నాడని వెల్లడించింది.

కొన్నేళ్ల క్రితం దిల్జిత్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ' నా ఫ్యామిలీకి ఏదైనా చెడు జరిగితే తట్టుకోలేను. నా కుటుంబం పట్ల కించపరిచేలా లక్ష్యంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు.  అందుకే వారిని ట్రోల్స్, మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా. నా తప్పుల కారణంగా నా కుటుంబం బాధపడకూడదని నేను కోరుకుంటా.' అని అన్నారు. కాగా.. పరిణీతి చోప్రా, దిల్జీత్‌ జంటగా నటించిన అమర్ సింగ్ చమ్కిలా  డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజవుతోంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, అర్జున్ కపూర్‌తో నో ఎంట్రీ- 2 చిత్రంలో నటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement