
ప్రముఖ నటుడు అర్జున్ మాథుర్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలి తియా తేజ్‌పాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈనెల 9న వీరి వివాహ వేడుక జరిగినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు.
కాగా.. అర్జున్ మాథుర్ చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్-2 వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇందులో కరణ్ మెహ్రా పాత్రను పోషించాడు ఈ సిరీస్‌లో నటనకు గానూ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డ్ అందుకున్నారు. అంతే కాకుండా అర్జున్ మాథుర్.. లక్ బై ఛాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment