![Ala Amerikapurramullo: Music Dirctor Thaman Live Concert In USA - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/17/thaman.gif.webp?itok=IOQbftya)
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అమెరికాలో జరగనున్న మ్యూజికల్ కార్నివాల్ ‘అల అమెరికాపురములో..’లో పాల్గొననున్నారు. హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మ్యూజికల్ కార్నివాల్‌ని ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఏర్పాటు చేయనుంది. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్‌లో తమన్ తన బృందంతో కలిసి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కాన్సర్ట్‌కు టాలీవుడ్‌కి చెందిన ఓ టాప్ డైరెక్టర్‌తో పాటు ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ వారు గతంలో ఏఆర్ రెహమాన్‌తో ‘ఏఆర్‌ఆర్ లైవ్ ఇన్ కాన్సర్ట్ 2017 లండన్’, అనిరుద్‌తో ‘అనిరుధ్ లైవ్ ఇన్ కాన్సర్ట్ లండన్ అండ్ ప్యారిస్ 2018’ వంటి భారీ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు.
చదవండి:
హన్సిక సినిమా విడుదలపై నిషేధం విధించలేం
రూ.26 కోట్ల మోసం! సంగీత దర్శకుడిపై కేసు కొట్టివేత
Comments
Please login to add a commentAdd a comment