తమిళసినిమా: సంగీత దర్శకుడు నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడమ్ చిత్రం ఫేమ్ సిఎస్ అముదమ్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ బి. పంకజ్ బోరా కలిసి నిర్మిస్తున్నారు. నటి రమ్య నంబీశన్, మహిమ నబియార్, నందిత శ్వేత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని, గోపీ అమర్నాథ్ అందిస్తున్నారు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రత్తం అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సీఎస్ అముదమ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని తాను చదువుకున్న రోజుల్లోనే మిత్రులందరికీ, ఓకే కళాశాలలో చదువుకున్నామని చెప్పారు. ఆయన హీరోగా ఓ చిత్రం చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నానని ఈ రత్తంతో అది కుదిరిందని చెప్పారు. ఇది మీడియా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు.
చిత్రంలో మత రాజకీయాలు కూడా ఉంటాయని, అయితే ఇందులో ఇంతకుముందు వచ్చిన ఏ చిత్ర ఛాయలు ఉండవని చెప్పారు. దర్శకుడు అముదమ్ చెప్పిన కథ కొత్తగా ఉండటంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు విజయ్ ఆంటోని చెప్పారు. కాగా ఇటీవల ఏఆర్ రెహమాన్ నిర్వహించిన సంగీత కచేరీ వ్యవహారంలో నటుడు విజయ్ ఆంటోని హస్తం ఉన్నట్లు ఒక యూట్యూబ్‌లో ఛానల్‌లో ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన విజయ్ ఆంటోని ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, తాను ఆ యూట్యూబ్ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఇప్పటికే ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment