బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్‌సింగ్‌తో ఓ మహిళా అభిమాని దురుసుగా ప్రవర్తించింది. స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంతో అతని చేయి పట్టుకొని గట్టిగా కిందకు లాగింది. దీంతో అతని చేయి బెణికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్జిత్ సింగ్ సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ సాంగ్స్, కాన్సర్ట్ నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లోని రిద్ధి సిద్ధి ల్యాండ్‌మార్క్‌లో అర్జిత్ సింగ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అర్జిత్ పలు పాటలు ఆలపిస్తూ అందరిని అలరించాడు. అలాగే మధ్య మధ్యలో స్టేజికి దగ్గరగా ఉన్న అభిమానులతో ముచ్చటిస్తూ వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చారు.
(చదవండి: 'ఆదిపురుష్' ట్రైలర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్)
ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అర్జిత్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ చేతిని గట్టిగా కిందకు లాగింది. దీంతో అర్జిత్ అదుపు తప్పి కిందపడబోయాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో అతని చేయికి గాయమైంది. దీంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆమెకు సున్నితంగా హెచ్చరించారు.
(చదవండి: నా జీవితంలో సామ్‌తో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం: నాగచైతన్య)
‘మీరు చేసిన పనికి నా చేతులు వణుకుతున్నాయి. మీరు మీ సమయాన్ని సరదాగా గడపడానికి ఇక్కడికి వచ్చారు. నేను ప్రదర్శన ఇవ్వకపోతే మీకు ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది. మీరు నన్ను లాగారు. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. నేను చేయిని కదపలేకపోతున్నాను’ అని అన్నాడు. దీంతో సదరు మహిళ ఆర్జిత్‌కు క్షమాపణలు చెప్పింది. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగులో అర్జిత్ ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘హుషారు’, ‘ఉయ్యాల జంపాల’, ‘భలే మంచి రోజు’ తదితర సినిమాల్లో పాటలు పాడారు.
Comments
Please login to add a commentAdd a comment