Arjit Singh
-
మహిళా అభిమాని దురుసుతనం.. స్టార్ సింగర్‌కు గాయం!
బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్సింగ్తో ఓ మహిళా అభిమాని దురుసుగా ప్రవర్తించింది. స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంతో అతని చేయి పట్టుకొని గట్టిగా కిందకు లాగింది. దీంతో అతని చేయి బెణికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్జిత్ సింగ్ సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ సాంగ్స్, కాన్సర్ట్ నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లోని రిద్ధి సిద్ధి ల్యాండ్‌మార్క్‌లో అర్జిత్ సింగ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అర్జిత్ పలు పాటలు ఆలపిస్తూ అందరిని అలరించాడు. అలాగే మధ్య మధ్యలో స్టేజికి దగ్గరగా ఉన్న అభిమానులతో ముచ్చటిస్తూ వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చారు. (చదవండి: 'ఆదిపురుష్' ట్రైలర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్) ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అర్జిత్కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ చేతిని గట్టిగా కిందకు లాగింది. దీంతో అర్జిత్ అదుపు తప్పి కిందపడబోయాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో అతని చేయికి గాయమైంది. దీంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆమెకు సున్నితంగా హెచ్చరించారు. (చదవండి: నా జీవితంలో సామ్‌తో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం: నాగచైతన్య) ‘మీరు చేసిన పనికి నా చేతులు వణుకుతున్నాయి. మీరు మీ సమయాన్ని సరదాగా గడపడానికి ఇక్కడికి వచ్చారు. నేను ప్రదర్శన ఇవ్వకపోతే మీకు ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది. మీరు నన్ను లాగారు. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. నేను చేయిని కదపలేకపోతున్నాను’ అని అన్నాడు. దీంతో సదరు మహిళ ఆర్జిత్కు క్షమాపణలు చెప్పింది. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగులో అర్జిత్ ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘హుషారు’, ‘ఉయ్యాల జంపాల’, ‘భలే మంచి రోజు’ తదితర సినిమాల్లో పాటలు పాడారు. View this post on Instagram A post shared by Arijit Singh (@arijitsinghliveupdates) -
ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో
IPL2023OpeningCeremony: ఐపీఎల్-2023 సీజన్ ఆరంభం వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సహా కార్యదర్శి జై షా తదితరులు హాజరయ్యారు. Photo Credit : IPL Twitter నటి మందిరా బేడి ఐపీఎల్ యాంకర్‌గా పునరాగమనం చేసింది. ఆరంభ వేడుకులకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. Photo Credit : IPL Twitter కాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన గానా బజానాతో అభిమానులను అలరిస్తున్నాడు. అర్జిత్ సింగ్‌తో పాటు పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మంధాన, మిల్కీ బ్యూటీ తమన్నాలు తమ డాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించారు. Photo Credit : IPL Twitter Photo Credit : IPL Twitter ఊ అంటావా అంటూ తమన్నా మాస్ స్టెప్పులు హీరోయిన్ తమన్నా భాటియా ఐపీఎల్-2023 ఆరంభ వేడుకల్లో తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. టమ్ టమ్ అంటూ ట్రెండింగ్ పాటకు స్టెప్పులేసిన తమన్నా.. ఊ అంటావా మామా అంటూ ఉర్రూతలూగించింది. Photo Credit : IPL Twitter సామీ గర్ల్ రష్మిక కూడా.. పుష్ప క్రేజ్‌తో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోన్న రష్మిక మందన్నా సామీ సామీ అంటూ ప్రేక్షకులకు వినోదం పంచింది. శ్రీవల్లి పాటతో పాటు గంగూభాయ్ కతియావాడీలోని డోలీడా పాటకు అదరగొట్టే స్టెప్పులేసింది. Photo Credit : IPL Twitter 𝙈𝙚𝙡𝙤𝙙𝙞𝙤𝙪𝙨! How about that for a performance to kick off the proceedings 🎶🎶@arijitsingh begins the #TATAIPL 2023 Opening Ceremony in some style 👌👌 pic.twitter.com/1ro3KWMUSW — IndianPremierLeague (@IPL) March 31, 2023 𝘿𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧!@tamannaahspeaks sets the stage on 🔥🔥 with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C — IndianPremierLeague (@IPL) March 31, 2023 -
పాటే నా వ్యాపకం
ఓ శీతాకాలపు రాత్రి ‘ఆల్ ఈజ్ వెల్.. ఎండింగ్ ఈజ్ వెరీ వెల్’ అంటూ ‘మ్యూజిక్ ఫుల్’ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు అర్జిత్ సింగ్. మొన్న అఫ్రోజాక్, ఎడ్వర్డ మాయా, నిన్న మికాసింగ్.. ఇక ఈ ఇయర్ చివరిలో వచ్చి సిటీని తన పాటల తోటలో విహరింపజేశాడు బాలీవుడ్ సింగర్ అర్జిత్‌సింగ్. ఈ పాటగాడి ప్రతిభ యువతను ఉర్రూతలూగించింది. ‘తుం హి హో’, ‘తుహి మేరి షబ్నం’, ‘బీగి బీగి యాదే’.. వంటి సూపర్‌హిట్ సాంగ్సతో హైదరాబాదీల మనసు దోచేశాడు అర్జిత్. గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని గోల్ఫ్ అండ్ కంట్రీక్లబ్ ఆడిటోరియంలో ఈ గళ మాంత్రికుని గాత్రంలో టెక్ పీపుల్, పార్టీ పీపుల్, స్టూడెంట్స్ ఓలలాడారు. ‘ఆశికీ-2’ సాంగ్సతో ప్రారంభమైన లైవ్ కన్సర్ట శ్రోతల ఆనందోత్సాహాల మధ్య ఆడుతూపాడుతూ సాగింది. వింటర్ నైట్‌ను తన పాటల మ్యాజిక్‌తో వండర్‌ఫుల్‌గా మార్చేసిన అర్జిత్ సింగ్‌తో సిటీప్లస్ ఫటాఫట్.. ..:: సిద్ధాంతి టాలీవుడ్లో పాడే అవకాశాలు ఉన్నాయా? అవకాశం వస్తే నా కంట్రిబ్యూషన్ ఇక్కడ కూడా ఉంటుంది. మీ పాటల్లో మీకు బాగా నచ్చింది ఏది..? ‘తుం హి హో..’ ఇది నా ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్. హైదరాబాద్ గురించి...? ఇట్స్ అమేజింగ్ సిటీ. ఇక్కడ నన్ను అభిమానించే ఫ్యాన్స చాలామంది ఉన్నారు. అటువంటి వారి మధ్య నా లైవ్ కన్సర్ట నిర్వహించడం ఆనందంగా ఉంది. బాలీవుడ్లో ఏ సెలబ్రేషన్స్ జరిగినా.. మీ పాట లేకుండా ఉండవని అంటారు.. మీ ఫీలింగ్ ? ఆ అనుభూతి అద్భుతమైంది. దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. మ్యూజిక్ ద్వారా నేను పంచుతున్న ఆనందమే.. అభిమానులకు నన్ను దగ్గర చేస్తోంది. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక..? లక్ష్యం పెట్టుకుంటే సరిపోదు. దాన్ని అందుకునేందుకు పూర్తి ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ ప్రయత్నంలో అడ్డంకులు ఎదురైతే కుంగిపోకూడదు. అవి మనల్ని మరింత రాటుదేలుస్తాయని గుర్తించుకోవాలి. ముఖ్యంగా మనం చేసే పనిపై మనకంటూ కొన్ని అంచనాలు ఉండాలి. వాటిని అందుకునేలా ప్లానింగ్ ఉండాలి. అదే సక్సెస్ ఆటిట్యూడ్. మ్యూజిక్ కాకుండా ఇతర వ్యాపకాలేమైనా ఉన్నాయా? మ్యూజిక్.. మ్యూజిక్.. అదే నా లోకం. సంగీతం నా గుండె చప్పుడు. అది నన్ను ఎప్పటికప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. పాట తప్ప మరే వ్యాపకం నాకు లేదు.